ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్.. ఎయిర్‌పోర్ట్‌లో ప్యాసెంజర్స్ నిరసన

ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్.. ఎయిర్‌పోర్ట్‌లో ప్యాసెంజర్స్ నిరసన

ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా ప్రయాణికులు నిరసనలు తెలిపారు. నినాదాలు చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 2 నుండి బయలుదేరే విమానాన్ని రద్దు చేయడంతో.. ఢిల్లీ-డియోఘర్ ఇండిగో విమాన ప్రయాణీకులు ఎయిర్‌లైన్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

ప్రతికూల వాతావరణం కారణంగా రాజధానికి వెళ్లే, దేశ రాజధాని నుండి బయలుదేరాల్సిన అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి, మరికొన్ని రద్దయ్యాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్, ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో మొత్తం 51 విమానాలు ఆలస్యం అయ్యాయి. మరో 11 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి.

వైరల్ వీడియోపై ఇండిగోకు రూ.1.5 కోట్ల జరిమానా

ఇటీవల, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఎఎస్) ఇండిగోపై రూ. 1.50 కోట్ల జరిమానా విధించాయి, ముంబై విమానాశ్రయంలో ప్రయాణీకులు టార్మాక్‌పై తింటున్నట్లు చూపించే వీడియోకు సంబంధించి.. BCAS రూ. 1.20 కోట్ల జరిమానా విధించగా, DGCA విమానయాన సంస్థపై రూ. 50 లక్షల జరిమానా విధించింది.