బండి భగీరథ్ గురించి బాధితురాలి తల్లి సంచలన లేఖ..

బండి భగీరథ్ గురించి బాధితురాలి తల్లి సంచలన లేఖ..

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బండి భగీరథ్ విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు పోలీసులు. మే 13న విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయగా.. రెండు రోజుల సమయం కోరారు బండి సంజయ్. ఈ క్రమంలో బండి సంజయ్ గురించి లేఖ విడుదల చేశారు బాధితురాలి తల్లి. ఈ లేఖలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బాధితురాలి తల్లి లేఖలో విషయాలు యధాతధంగా:

  • 2025 సంవత్సరంలో మా కూతురికి బండి భగీరథ్ పరిచయం అయ్యాడు 
  • మొదట స్నేహితుడులాగా ఉన్నా, మా కూతురిని మానసికంగా లోబర్చుకుని, చదువు కోకుండా డిస్టర్బ్ చేశాడని గుర్తించాము 
  • జనవరి 2026లో వారి మధ్య గొడవ జరిగినప్పుడు, గతంలో భగీరథ్ తనపై పలు మార్లు లైంగిక దాడి చేశాడని, డిసెంబర్ 31వ తేదీన బలవంతంగా మద్యం తాగించి ఒకసారి, మరోసారి ఓ అపార్టుమెంటులో అఘాయిత్యానికి పాల్పడ్డాడని మా కూతురు చెప్పింది
  • రాజకీయ శక్తులతో పోరాడడానికి చట్ట పరంగా, మానసికంగా సిద్ధమవుతున్న రోజుల్లో ఏప్రిల్ 21వ తేదీ 2026లో తమ కూతురిపై బ్లాక్మెయిల్ కేసు పెట్టారని తెలిసి మా మీద కుట్ర చేస్తున్నారని గ్రహించాము 
  • ఏప్రిల్ 22వ తేదీన సంగప్ప అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించాడు
  • ఏప్రిల్ 23వ తేదీన సంగప్ప ద్వారా బండి సంజయ్‌ని కలిసాము, న్యాయం చేస్తారు అనుకుంటే మా గురించి దారుణంగా మాట్లాడి, బెదిరించి పంపించేశారు
  • నా కూతురి కోసం కోట్లాడాలని నిర్ణయించుకుని మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు నా కూతురిని తీసుకుని వెళ్ళాను 
  • కానీ అక్కడి పోలీసులు ఎంత వేడుకున్నా ఫిర్యాదు తీసుకోకుండా గంటల తరబడి మమ్మల్ని వెయిట్ చేయించారు
  • ఎన్నో సార్లు బతిమాలిన తరువాత ఎట్టకేలకు బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు
  • మొదలు బండి భగీరథ్ మీద బెయిల్ వచ్చేలా సెక్షన్లు పెట్టినా, మా కూతురి స్టేట్మెంట్ రికార్డ్ చేశాక సెక్షన్లు మార్చారు
  • అయితే మేము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వేచి ఉన్న సమయంలో మా కూతురిపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ కేసు పెట్టాడని తెలిసింది 
  • మేము స్టేషన్లో ఉన్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్, రిజిస్టర్లో టైమింగ్స్ భద్రపరచాలని, అలా చేస్తే బండి భగీరథ్ ఏ సమయంలో కేసు పెట్టాడో స్పష్టంగా తెలిసి పోతుందని పోలీసులకు విజ్ఞప్తి చేశాము
  • మీడియా వారిని, సోషల్ మీడియా యూజర్లను చేతులు జోడించి వేడుకుంటున్నాను, దయచేసి మా కూతురి ఫొటోలు, ఆమె ఐడెంటిటీ రివీల్ చేయకండి
  • మరో వైపు ఆమె డేట్ ఆఫ్ బర్త్ గురించి అనేక వాదనలు వినిపిస్తున్నాయి, డాక్యుమెంట్లలో ఉండే డేటా నా కూతురు అనుభవించిన క్షోభను చెరిపివేయలేదు
  • POCSO కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ పట్ల వేగంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నా కూతురికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను