సునీల్ నాయక్ అంత్యక్రియలకు వెళ్తుండగా బండి సంజయ్ అరెస్ట్

సునీల్ నాయక్ అంత్యక్రియలకు వెళ్తుండగా బండి సంజయ్ అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా : సునీల్ నాయక్ అంత్యక్రియలకు వెళ్తుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ నుండి మహబూబాబాద్ జిల్లాకు వెళ్తుండగా నర్సంపేట దగ్గర బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం లేదని సునీల్ పురుగుల మందు తాగిన విషయం తెలిసిందే. అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. సునీల్ నాయక్‌ మృతదేహం ఇంతకుముందే రామ్‌ సింగ్‌ తండా చేరుకుంది. అంబులెన్స్ ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించారు. సునీల్ కుటుంబానికి న్యాయం జరగాలని స్థానికుల నిరసనకు దిగారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. సునీల్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ సునీల్ నాయక్ అంత్యక్రియలకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.