ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డ్రామాలెందుకు.?: బండి సంజయ్

ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డ్రామాలెందుకు.?: బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డ్రామాలాడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు.  షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది.. ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల ప్రజాపాలన అప్లికేషన్లు కంప్యూటరీకరణ ,క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో టైంపాస్ చేస్తుందని ధ్వజమెత్తారు. 

అసలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎలా గట్టెక్కిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.  ఆర గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఒక్కో వ్యక్తిపై లక్షన్నర రూపాయల అప్పు భారం మోపారని.. వాటినెలా తీరుస్తారని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు.. రేషన్ కార్డు ప్రాతిపదికగా 6 గ్యారంటీలను అమలు చేస్తామంటే పేదలకు న్యాయం జరిగే అవకాశం లేదన్నారు

కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు బండి సంజయ్. రాష్ట్ర ప్రజలంతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ ఎంపీలను గెలిపించాలని కోరారు.  ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని మొత్తుకున్నా గత ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు. ఇవాళ ఉపాధ్యాయులే స్కూళ్లలో టాయిలెట్లు కడిగే దుస్థితి కన్పిస్తోందన్నారు. చాలా పాఠశాలల్లో వసతుల్లేవు.. టాయిలెట్స్ లేవని ధ్వజమెత్తారు.