ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గురువారం ( ఫిబ్రవరి 19 ) హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ పురానాపూల్ దర్వాజా దగ్గరికి చేరుకుంది ఈ ర్యాలీ. ఈ క్రమంలో సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ విధిస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. హైదరాబాద్ లోని ఆరు ప్రాంతాల నుండి ప్రారంభమైన శివాజీ మహారాజ్ యాత్రలు ఓల్డ్ సిటీకి చేరుకున్న క్రమంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ విధించినట్లు తెలిపారు డీసీపీ.
ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా..
పురానాపూల్ దర్వాజా నుండి ప్రారంభం కానున్న ర్యాలీ ఇమ్లిబన్ బస్ స్టాప్ వైపుగా సాగి ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర ఉన్న చత్రపతి శివాజీ బిడ్జి స్టాచు దగ్గరికి చేరుకుంటుందని.. ఈ క్రమంలో ఆరంఘర్ చౌరస్తా నుండి ఎంజీబీఎస్ బస్ స్టాప్ వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టమని తెలిపారు.
ఎంజీబీఎస్ నుండి వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సులను 10 ప్రాంతాల నుండి డైవర్ట్ చేసేందుకు ఆర్టీసీ అధికారులతో చర్చించి అడ్వైజరిని విడుదల చేసామని..ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని తెలిపారు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే.
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశామని..ర్యాలీ జరుగుతున్న సమయంలో ప్రజలు ట్రాఫిక్ అడ్వైజరీని గమనించి ప్రయాణాలు సాగించాలని కోరారు.
