ఒవైసీ హాస్పిటల్‌‌ను ఐసోలేషన్ వార్డు ఎందుకు చేయరు?

ఒవైసీ హాస్పిటల్‌‌ను ఐసోలేషన్ వార్డు ఎందుకు చేయరు?

ఒవైసీ హాస్పిటల్‌‌ను ఐసోలేషన్ వార్డు జేయాలే
కరోనాపై ముస్లింలను చైతన్య పరచని మజ్లిస్ నేతలు
ప్రధాని మోడీపై తప్పుడు కామెంట్లు చేసిన ఒవైసీపై చర్యలకు డిమాండ్
డాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలి
సీఎం కేసీఆర్‌‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ చేసేందుకు ఉన్న హాస్పిటళ్లు సరిపోని ఈ టైమ్‌‌లో కూడా మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాస్పిటల్‌‌ను ఎందుకు ఐసోలేషన్ వార్డుగా మార్చడం లేదో సీఎం కేసీఆర్‌‌ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒవైసీ హాస్పటల్‌‌లో పని చేసే డాకర్టను కరోనా చికిత్సల కోసం ఎందుకు వాడుకోవడం లేదని సీఎంను ప్రశ్నించారు. కరోనా బాధితులుగా ఉన్న వారిలో 99 శాతం మంది ముస్లింలేనని, వారిని ఆదుకునేందుకు ఒవైసీ
ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. గురువారం సంజయ్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఒవైసీ తీరును ఎండగట్టారు.
ముస్లింలను ఓటు బ్యాంక్ గా వాడుకునే అసద్, ఈ వైరస్‌‌పై ముస్లిం సమాజంలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని దుయ్యబట్టారు. కరోనాతో రాష్ట్రం మొత్తం భయందోళనలో ఉంటే, టీఆర్ఎస్‌‌తో కలిసి ప్రభుత్వాన్ని పంచుకుంటున్న మజ్లిస్.. వైరస్‌‌పై ముస్లింలకు కనీసం అవగాహన కలిగించే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇన్ని రోజుల్లో ఎంతో మంది ముస్లింలు కరోనా బాధితులుగా మారితే, వారి కోసం ఏనాడు బయటకు రాకుండా, వారికి ఎలాంటి సూచనలు చేయకుండా, కేవలం తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఒవైసీ ఇంటికే పరిమితమయ్యాడని విమర్శించారు.

దేశంలో కరోనా కంట్రోల్‌‌కు, ప్రజల్ని కాపాడేందుకు లాక్ డౌన్ అమలు చేస్తూ ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు పొందుతున్న మోడీపై ఒవైసీ రాజకీయ కోణంలో విమర్శలు చేయడం సరికాదన్నారు. రోజు, రోజుకు మోడీకి వస్తున్న ఆదరణను చూసి అసదుద్దీన్ ఇలాంటి తప్పుడు కామెంట్లు చేస్తున్నారన్నారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంజయ్ టీఆర్ఎస్ సర్కార్‌‌ను కోరారు. గాంధీలో డాక్టర్లపై దాడి జరిగితే మజ్లిస్ నేతలు ఎందుకు స్పందించరని సంజయ్ ప్రశ్నించారు. ఒకవేళ అదే డాక్టర్లు ఈ దాడులకు నిరసనగా డ్యూటీ బాయ్‌‌కాట్ చేస్తే నష్టపోయేదెవరో గుర్తుంచుకోవాలని ఒవైసీకి సూచించారు. ఢిల్లీలో కరోనా బాధితులు ట్రీట్‌‌మెంట్‌‌కు సహకరించకుండా డాక్టర్లపై ఉమ్మి వేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌‌లో కరోనా పేషెంట్ల గురించి సర్వే చేస్తున్న ఆశా వర్కర్లపైకి కొందరు కుక్కులను ఎగతోస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలపై అసద్ ఎందుకు స్పందించరని నిలదీశారు. పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు చికిత్స చేస్తూ తమ ప్రాణాలకు ముప్పు అని తెలిసినా, తమ పిల్లలకు దూరమైతమనే భయం.. డాక్టర్లను, నర్సులను వెంటాడుతున్నా.. వృత్తే దైవంగా డాక్టర్లు సేవ చేస్తున్న విషయాన్ని మజ్లిస్ నేతలు గుర్తుంచుకోవాలని కోరారు. డాక్టర్లను, నర్సులను విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం కేసీఆర్‌‌ను సంజయ్ డిమాండ్ చేశారు.

విరాళాలివ్వండి…
పీఎం కేర్స్ నిధికి కార్యకర్తలందరూ విరాళం ఇవ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు కనీసం రూ.100 తగ్గకుండా
అందజేసి, మరో పది మందితో ఇప్పించాలని సూచించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విరాళాలు అందించి, దాన్ని స్క్రీన్ షాట్ తీసి TSDonates2PMCARESతో సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.

For More News..

దేశంలో 42 కరోనా హాట్ స్పాట్లను గుర్తించిన కేంద్రం

కరోనా పేషంట్లను గుర్తించే యాప్.. మీరు కూడా చెక్ చేయోచ్చు…

ఏపీకి అరబిందో ఫార్మా భారీ సాయం

ట్విన్స్ నామకరణం: పాపకు కరోనా.. బాబుకు కోవిడ్..