కాంగ్రెస్ వల్లే1400 మంది చనిపోయారు: ఎంపీ బండి సంజయ్

కాంగ్రెస్ వల్లే1400 మంది చనిపోయారు: ఎంపీ బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో 1400 మంది చనిపోవడానికి కారణమైన కాంగ్రెస్.. ప్రధాని మోదీని విమర్శించడం విడ్డూరంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. స్క్రిప్ట్ రైటర్‌ను మార్చుకోండి పప్పూజీ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్వీట్​ చేశారు. తెలంగాణకు మీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు మోసం చేశారని రాహుల్​పై మండిపడ్డారు. వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు మీరు, మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలి? అని బండి సంజయ్  ప్రశ్నించారు. 

ఇందిరా గాంధీ - ప్రభుత్వం కారణంగా 1969లో దాదాపు 369 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. సోనియా 2009లో తెలంగాణ ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారని చెప్పారు. 1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత కాంగ్రెస్  తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిందని  సంజయ్ పేర్కొన్నారు.

మహిళా బిల్లు బీజేపీ చిత్తశుద్ధికి నిదర్శనం 

మహిళా బిల్లు బీజేపీ చిత్తశుద్ధికి నిదర్శనమని బండి  సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరీ వల్ల మూడు దశాబ్దాలుగా  బిల్లు ఆమోదానికి నోచుకోలేదని ఆరోపించారు.