ప్రజావాణికి వచ్చి చూస్తే..ధరణి కష్టాలు తెలుస్తయ్‌‌‌‌‌‌‌‌

ప్రజావాణికి వచ్చి చూస్తే..ధరణి కష్టాలు తెలుస్తయ్‌‌‌‌‌‌‌‌

‘కే సీఆర్‌‌‌‌‌‌‌‌.. బహిరంగ సభల్లో, ఏసీ రూమ్‌‌‌‌‌‌‌‌ల్లో ఆహోఓహో అంటూ ముచ్చట్లు చెప్పుడు కాదు. ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌ గురించి డబ్బా కొట్టుడు ఆపి, ఒక్కసారి 33 జిల్లాల్లో ఏ జిల్లాలోనైనా ప్రతీ సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే ప్రజావాణి(గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌)కి వెళ్లి చూడు. అప్పుడు తెలుస్తది నీ ధరణి కథేందో, పేదలు, రైతన్నలకు అది తెచ్చిన కష్టాలేందో!  పట్టా పాసుపుస్తకాలు, చేతుల పట్టుకుని నెలల తరబడి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌లు, కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ల చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది రైతన్నలు, పేదల గోస కళ్లారా చూడు. తన భూమే తనది కాదని చూపెడుతున్న ధరణి ఎన్ని కుటుంబాల్లో ఉసురు తీసిందో  లెక్కలు తీయు. నువ్వు తెచ్చిన అని గొప్పలు చెబుతున్నవ్‌‌‌‌‌‌‌‌ కదా.. అసలు ఆ ధరణి వల్ల బాగుపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు చెప్పు. నీకు దమ్ముంటే దీనిపై శ్వేతపత్రం విడుదల చేయు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలని పెట్టినవ్‌‌‌‌‌‌‌‌ కదా,  అందులో ఒకరోజు ధరణి ఉత్సవం పెట్టు. అప్పుడు తెలుస్తది నీ కథేందో.  మీ అనుచరులకు భూపందారం చేసేందుకే ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌ తీసుకువచ్చినవ్‌‌‌‌‌‌‌‌. ప్రభుత్వ భూములన్ని అమ్ముకుంటూ రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడుస్తున్నవ్‌‌‌‌‌‌‌‌. నీ అవినీతి, అక్రమాలమయమైన కుటుంబపాలన రాష్ట్రాన్ని ఎంతలా దోచుకుంటుందో తెలంగాణలో ఏ మూలన వెళ్లినా.. ఏ పిల్లాడిని అడిగినా చెబుతరు!  రాష్ట్రంలో లీకేజీ, ప్యాకేజీ, కమీషన్లు లేని కథలేమైనా ఉన్నాయా? ప్రతీ పనికో రేటు కట్టి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. 

గాలి మాటలు

కేజీ టు పీజీ ఉచితవిద్య అంటూ గొప్పలు చెప్పుకునే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలో ఎన్ని కోట్ల ఫీజురీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బాకీ ఉందో చెప్పు. నీ మనుమడు, మనుమరాలు చదువుకుంటున్నట్లు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకోవద్దా..?  వాళ్లకు కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ స్థాయిలో చదువుకునే అవకాశం ఉండొద్దా..? సుసంపన్న, సంక్షేమ రాష్ట్రంలో కార్పొరేషన్లకు నిధులెక్కడున్నయ్‌‌‌‌‌‌‌‌..? ఎంతమంది నిరుద్యోగ యువతకు రుణాలు ఇచ్చినవ్‌‌‌‌‌‌‌‌..? నోటిఫికేషన్లు రాక, ఉద్యోగాలు లేక స్వయంఉపాధి కోసం యువత ఎదురుచూస్తోంది. కనీసం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ల రుణాలూ ఇవ్వకపోతే వాళ్ల బతుకులు ఎట్లా గడవాలో చెప్పు కేసీఆర్‌‌‌‌‌‌‌‌? అడవులను నమ్ముకున్న గిరిబిడ్డలకు 10శాతం రిజర్వేషన్ లు ఇస్తానని, పోడు భూములకు పట్టాలు అందిస్తామని ఏళ్లుగా మాటలు చెబుతున్నరు. ఇప్పటికీ  ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తెలంగాణ సాధన కోసం తమ ఉద్యోగాలనూ ఫణంగా పెట్టి పోరాడిన వాళ్లకూ జీతాలు ఇవ్వడం లేదు. రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తర్వాత పెన్షన్‌‌‌‌‌‌‌‌ డబ్బుల మీద ఆధారపడే వారికీ సకాలంలో పైసలివ్వడం లేదు. పేరుకు ఉద్యోగస్తులే కానీ.. వారు నెలనెలా అప్పులు చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇంటింటికీ నల్లాలు పెట్టినమని గొప్పలు చెప్పడం కాదు, మీరందించే మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ నీరు ఎన్ని ఇండ్లకు రావడం లేదో తెలుసా..? చాలా జిల్లాల్లో ఆ నీళ్లు ఎందుకు తాగడం లేదో.. ఎప్పుడైనా ఆరా తీశావా కేసీఆర్‌‌‌‌‌‌‌‌..? బంగారు తెలంగాణ అంటూ.. దశాబ్ది ఉత్సవాలంటూ గొప్పలు చెప్పే మీ కుటుంబ పాలనలో ఏ రంగం బాగుపడింది..? ఏ పేదోడి కడుపు నిండింది..? ఏ రైతన్న గోస తీరింది..? ఎన్నికలప్పుడు గాలిలో తిరుగుకుంటా.. గాలికి హామీలిచ్చి.. ఇంకెన్నేళ్లు తెలంగాణ ప్రజలను మోసగిస్తావ్‌‌‌‌‌‌‌‌ కేసీఆర్‌‌‌‌‌‌‌‌..? 

బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండూ ఒకటే..

దేశంలో రాజకీయాలు చేయడం చేతగాని రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీ విదేశాలకు వెళ్లి విషం కక్కుతుంటాడు. మన దగ్గర ఆయన పప్పులేం ఉడకవని, అప్పుడప్పుడు అలా విదేశాలకు వెళ్లి మాట్లాడి వస్తుంటాడు. దేశ పరువును తీయడంలో రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీ నిష్ణాతుడని అందరికీ తెలిసిపోయింది. ఇక బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ రెండూ ఒకటే. అందుకే చెప్తున్నాం.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఓటు వేసినా అది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు వేసినట్లే! కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై గోరంత ఉంటే.. కొండంత చూపుతున్నారు. రాష్ట్రంలో పెరిగిన బీజేపీ గ్రాఫ్‌‌‌‌‌‌‌‌ను చూసి ఓర్వలేకనే కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారు. ఎవరెన్ని అవాకులు, చవాకులు పేలినా రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో అమరవీరుల ఆకాంక్షల నెరవేరే విధంగా, సబ్బండ వర్గాల పురోగతి కోసం రాష్ట్రంలో బీజేపీ డబుల్‌‌‌‌‌‌‌‌ ఇంజిన్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తాం.

తెలంగాణకు కేంద్రం సాయం

ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. తెలంగాణను అన్నిరంగాల్లో వెనక్కు నెట్టేస్తున్నారు. రాష్ట్ర పురోగతి కోసం కేంద్రం అనేక రూపాల్లో సహాయం చేస్తోంది. రాష్ట్రంలో రహదారులు, రైల్వేల విస్తరణ కోసం కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. బీబీనగర్‌‌‌‌‌‌‌‌ ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ మంజూరు చేసింది. కరోనా కష్టకాలంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడింది. ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా పనిచేసింది. చివరకు ప్రపంచ దేశాలకే ప్రాణభిక్ష పెట్టేలా కరోనా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ను ఉచితంగా అందించింది. దానికి ప్రతిఫలంగానే ఆయా దేశాలు మనదేశం ముందు మోకరిల్లుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం కనీసం పేదలకు నెలనెలా ఇవ్వాలని కేంద్రం పంపించిన బియ్యాన్ని కూడా సక్రమంగా ఇవ్వలేదు. రేషన్‌‌‌‌‌‌‌‌ డీలర్ల సమస్యల మీదా ఈ సర్కారుకు మాట్లాడే తీరిక లేదు. కరోనా రక్కసి బారినపడి చనిపోయిన కుటుంబాల కోసం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కనీసం ఒక్క కన్నీటిచుక్క కూడా కార్చలేదు. 

ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు

తెలంగాణ రైతుల కష్టాలే పట్టించుకోనోడు దేశంలో కిసాన్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ తెస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. పంట నష్టపోతున్న రైతులకు పరిహారమిచ్చే ముఖం లేదు. కనీసం కేంద్రం ఇచ్చే ఫసల్‌‌‌‌‌‌‌‌బీమా పథకమైనా అందించడు. అకాల వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా.. కర్షకుల కష్టాన్ని కనీసం పట్టించుకోని కర్కోటక సీఎంగా పేరొందాడు. దేశానికి తెలంగాణ మోడల్‌‌‌‌‌‌‌‌ అవసరమని చెబుతున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌.. అసలు రాష్ట్రంలో ఏమున్నదో ముందు చెప్పాలి. రైతు రుణమాఫీ లేదు, ఫసల్‌‌‌‌‌‌‌‌ భీమా అమలు కాదు. యంత్రలక్ష్మి జాడలేదు.  కౌలురైతులకు రక్షణ ఉండదు. ఇక దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న ముచ్చటనే లేదు. పెద్దకొడుకు ఇంట్లో ఒక్కరికే తిండి పెడితే సరిపోతుందా..? తన ఇంట్లో ఐదుగురికి పదవులిచ్చిన కేసీఆర్, పేదల ఇళ్లల్లో మాత్రం ఒక్కరికే ఆసరా పింఛన్‌‌‌‌‌‌‌‌ ఇస్తుండు. అన్ని అర్హతలు ఉన్నా.. ఇప్పటికీ ‘పింఛనిప్పించండి సారూ..’ అంటూ ఆఫీసుల వెంట తిరుగుతున్న బాధితుల గోసనూ పట్టించుకోడు. నెలల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న దళిత కుటుంబాల్లో ఎందరికి దళితబంధు ఇచ్చారు..? తన ఎమ్మెల్యేలే పైసలు తీసుకుని దళితబంధు ఇస్తున్నారని కేసీఆరే ఒప్పుకున్నాడు. రాష్ట్రంలో అవినీతి ఏస్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే ఆధారం ఇంకేం కావాలి? ఇప్పటికీ అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల చెప్పుచేతుల్లోనే దళితబంధు అమలవుతోంది. వారికి నచ్చినవారికి, పైసలిచ్చినవారికే పథకం అందుతోంది.
- బండి సంజయ్,ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు