డబ్బుకు అమ్ముడుపోయిన ప్రభుత్వం: బండి సంజయ్

డబ్బుకు అమ్ముడుపోయిన ప్రభుత్వం: బండి సంజయ్
  • ప్రమోషన్ల కోసం పనిచేస్తున్న పోలీసులు
  • వర్సిటీ హోదా రాకుండానే 4 వేల మందికి అడ్మిషన్లా..? 
  • గురునానక్, శ్రీనిధి కాలేజీలకు ఎందుకంత ధైర్యం
  • ఉన్నత విద్యామండలి ఎదుట ధర్నా చేస్తే ఇబ్బందేంటి? 
  • దళితులను తిట్టిన మంత్రిపై అట్రాసిటీ కేసు పెట్టాలి 
  • బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్

కేసీఆర్ ప్రభుత్వం డబ్బులకు అమ్ముడుపోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ఇవాళ దిల్ సుఖ్ నగర్ లో ఏబీవీపీ నాయకురా లు ఝాన్సీని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమోషన్ల కు అమ్ముడుపోయిన కొందరు పోలీసు అధికా రులు ఏబీవీపీ నాయకులను వేధిస్తున్నారన్నారు. ప్రైవేటు వర్సిటీల హోదా రాకుండానే గురునానక్, శ్రీనిధి కాలేజీలు నాలుగు వేల మందికి అడ్మిషన్లు ఎలా ఇచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు.

కౌన్సిలింగ్ ప్రారంభం కాకుండానే ఇంజనీరింగ్ అడ్మిషన్ల దందా చేస్తారా? అంటూ దుయ్యబట్టారు. విద్యార్థుల పక్షాన ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా చేస్తే కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. ఏబీపీవీ రాష్ట్ర కార్యదర్శి ఝూన్సీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సరికాదన్నారు. టార్గెట్ చేసి ఝాన్సీని బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు లాఠీలతో చితకబాది.. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా? ఆత్మర క్షణ కోసం ఎదిరిస్తే పోలీసులనే కొడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తారా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? లేక రౌడీ రాజ్యమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ పరిణామాలకు కారకులైన ఏసీపీ సహా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దళితులను థర్డ్ క్లాస్ ఫెలోస్ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'ఆ మంత్రికి ఎంత కండకావరం? దళిత సంఘాలు ఏం చేస్తున్నాయి? అంబేద్కర్ రాజ్యాంగం పుణ్యమా? అని నువ్వు ఎమ్మెల్యే అయినవ్. మంత్రి పదవి వచ్చింది. లేకుంటే నీది బిచ్చపు బతుకయ్యేది.' అంటూ ఫైర్ అయ్యారు.