నీ కొడుక్కి కోవిడ్ రూల్స్ వర్తించవా.?

నీ కొడుక్కి కోవిడ్ రూల్స్ వర్తించవా.?

సామరస్యంగా జాగరణ దీక్ష చేపట్టామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య దీక్ష మొదలు పెట్టిన బండి సంజయ్..  భార్యాభర్తలకు కేసీఆర్ కొట్లాట పెట్టారన్నారు. సీనియర్లకు ,జూనియర్లకు కొట్లాట పెట్టించారన్నారు. కోవిడ్ రూల్స్ అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేయాలని చూస్తున్నారన్నారు. కేటీఆర్ కు కోవిడ్ రూల్స్  వర్తించవా అని ప్రశ్నించారు.   ఇలాంటి ఘటనలు చూసి సీఎం సిగ్గుపడాలన్నారు.  సీనియార్టీ లిస్టులో తప్పులకు తన దగ్గర ఆధారాలున్నాయన్నారు.  తన కుటుంబాన్ని ఇబ్బందిపెట్టినట్లు..కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందిపెడతామన్నారు.

బండి సంజయ్ మాట్లాడుతుండగా మీడియా సిబ్బందిని లాగేశారు పోలీసులు.రిపోర్టర్లను,కెమెరామెన్లను బయటకు లాక్కెళ్లారు. దీంతో సీపీ సత్యనారాయణ రిపోర్టర్ల కు  మద్య వాగ్వాదం జరిగింది. దీక్షకు అనుమతి లేదని..అనుమతి లేకుండా దీక్ష చేస్తే అరెస్ట్ చేస్తామన్నారు. కోవిడ్ రూల్స్ కు విరుద్ధంగా మీటింగ్ పెట్టారన్నారు. కార్యక్రమానికి పర్మిషన్ అడగలేదన్నారు. మధ్యాహ్నమే  తాము నోటీసులిచ్చామన్నారు సీపీ.