
- నిన్ను సీఎంగా ప్రకటిస్తే బీఆర్ఎస్కు 3 మూడు సీట్లు వచ్చేవి కాదు
- మేడిగడ్డను మీరు ఎలా నాశనం చేశారో చూసి వస్తవా?
- కాంగ్రెస్‌నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్
హైదరాబాద్: కాంగ్రెస్‌నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ మాజీ మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. తండ్రి పేరు చెప్పుకొని లీడర్అయ్యాడని మండిపడ్డారు. బీఆర్ఎస్సర్కార్చేసిన డ్యామేజీని చూడటానికి మేడిగడ్డ టూరుకు వెళ్తున్నావా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో గణేశ్ మాట్లాడుతూ ‘కేటీఆర్ రాజకీయ పరంగా డిజాస్టర్. తండ్రి పేరు చెప్పుకొని లీడర్ అయ్యిండు. ఆయన చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుంది. రేవంత్ సీఎం కావడంతో బాధపడుతున్నడు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే బీఆర్ఎస్కు3 సీట్లు కూడా రాకపోయేవి. ఇల్లు కొనేందుకే ఆయనఅమెరికా వెళ్లిండు. బీఆర్ఎస్ లో కవిత, హరీశ్ మాత్రమే సమర్థులు. మేడిగడ్డ టూర్ ఎందుకు కేటీఆర్.. అక్కడికి వెళ్లి ఏం చేస్తరు. బ్యారేజీ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా? అని బండ్ల గణేశ్ఫైర్అయ్యారు.
రోజా పులుసు పాప.. డైమండ్‌రాణి
ఏపీ మంత్రి రోజాపై కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఫైర్అయ్యారు. ‘రోజా డైమండ్ రాణి.. రేవంత్ ఫైటర్, జగన్ ఆక్సిడెంట్ సీఎం. తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నరు. పులుసు వండి పెట్టావ్ కాబట్టి.. పులుసు రాణి మాత్రమే కాకుండా రోజా ఐటం రాణి’ అని పేర్కొన్నారు.