న్యూఢిల్లీ: చాలా విషయాల్లో తాము ఇండియన్ క్రికెటర్లను ఫాలో అవుతామని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ అన్నాడు. ముఖ్యంగా ఫిట్‌నెస్ విషయంలో విరాట్‌సేనను చూసి తమ అటిట్యూడ్‌ను మార్చుకున్నామన్నాడు. ఈ విషయంలో విరాట్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పాడు. ‘ఇండియా మా పొరుగు దేశం. చాలా విషయాలను ఫాలో అవుతాం. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఎక్కువే. ప్రారంభంలో ఫిట్‌నెస్‌పై మాకు పెద్దగా అవగాహన లేదు. కానీ ఇండియన్ టీమ్‌ను చూశాకా మా దృక్పధం మొత్తం మారిపోయింది. ఈ విషయంలో బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. ఇప్పుడు మేం కూడా ఫిట్‌నెస్ విషయంలో చాలా మెరుగవుతున్నాం’ అని తమీమ్ పేర్కొన్నాడు. రెండు జట్లలో సేమ్ ఏజ్ గ్రూప్ క్రికెటర్లు ఉండటం వల్ల.. చాలా మంది కోహ్లీ ఫిట్‌నెస్‌ను ఫాలో అవుతున్నామన్నాడు.
For More News..
