Asia Cup 2025: ఒక మాదిరి స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్.. టోర్నీలో నిలవాలంటే బౌలర్లపైనే భారం

Asia Cup 2025: ఒక మాదిరి స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్.. టోర్నీలో నిలవాలంటే బౌలర్లపైనే భారం

ఆసియా కప్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో రాణించింది.  మంగళవారం (సెప్టెంబర్ 16) ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఒక మాదిరి స్కోర్ చేసి బౌలింగ్ పైనే భారం వేసింది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ 52 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, నూర్ హండా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అజమాతుల్లా ఓమార్జాయి కి ఒక వికెట్ దక్కింది.     

ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. పటిష్టమైన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ బంగ్లా ఓపెనర్లు అదరగొట్టారు. తంజిద్ హసన్, సైఫ్ హసన్ జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే లో బౌండరీల వర్షం కురిపిస్తూ తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. పవరే ప్లే తర్వాత బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన సైఫ్ హసన్ ను రషీద్ ఖాన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత లిటన్ దాస్ 9 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. 

ALSO READ : Asia Cup 2025: పాక్ మాజీ ప్లేయర్ బలుపు మాటలు.. సూర్యను పంది అంటూ అవమానిస్తారా.

ఒక ఎండ్ లో అద్భుతంగా ఆడుతున్న తంజిద్ హసన్ 28 బంతుల్లో సెంచరీ చేసి 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. తోహిద్ హ్రిడోయ్ మిడిల్ ఓవర్స్ లో 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చివర్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. తొలి 10 ఓవర్లలో 87 పరుగులు చేసి అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ చివరి 10 ఓవర్లలో 67 పరుగులు మాత్రమే చేయగలిగింది.