Asia Cup 2025: పాక్ మాజీ ప్లేయర్ బలుపు మాటలు.. సూర్యను పంది అంటూ అవమానిస్తారా..

Asia Cup 2025: పాక్ మాజీ ప్లేయర్ బలుపు మాటలు.. సూర్యను పంది అంటూ అవమానిస్తారా..

ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ రోజు రోజుకీ దిగజారుతూ వస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 14) పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే బాధను పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతుంది. పాక్ క్రికెట్ బోర్డు, ప్లేయర్లతో పాటు మాజీలు టీమిండియాపై నోరు పారేసుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ యూసఫ్ కనీస మానవత్వాన్ని కోల్పోయి టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పై అసహ్యకరమైన కామెంట్స్ చేశాడు. సూర్యను పంది అంటూ లైవ్ లోనే దూషించాడు. 

సమా టీవీలో జరిగిన ఈ ఇంటార్వ్యూలో మాట్లాడుతూ లెజెండరీ క్రికెటర్ పేరున్న యూసఫ్ లైవ్ టీవీలోనే పదే పదే అని పిలిచాడు. ఈ మాజీ పాక్ క్రికెటర్ మాటలకు యాంకర్ కూడా షాక్ అయ్యాడు. యూసఫ్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నా అతను మాత్రం సూర్యకుమార్ యాదవ్‌ను దుర్భాషలాడుతూనే ఉన్నాడు. "ఇండియా తమ సినిమా ప్రపంచం నుండి బయటపడలేకపోతుంది. అంపైర్లను వాడుకుంటూ.. మ్యాచ్ రిఫరీ ద్వారా పాకిస్తాన్ ను హింసించి గెలవటానికి ప్రయత్నిస్తున్న తీరుకు సిగ్గుపడాలి". అని లైవ్ షో లో అన్నాడు. ఈ కామెంట్స్ తర్వాత సూర్యను పంది అని పిలిచాడు. 

ALSO READ : IND VS PAK: ఇండియాతో పాకిస్థాన్ మ్యాచ్ చూడడం దండగ.. ఆ రోజు నేను ఫుట్ బాల్ చూశా: సౌరవ్ గంగూలీ

మహమ్మద్ యూసఫ్ పాకిస్థాన్ జట్టులో లెజెండరీ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు. 1998 నుంచి 2010 మధ్య పాకిస్తాన్ తరపున 288 వన్డేలు, 90 టెస్ట్‌లు, 3 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 7530 పరుగులు.. వన్డేల్లో 9720 పరుగులు చేశాడు. యూసఫ్ ఖాతాలో అంతర్జాతీయ కెరీర్ లో 39 సెంచరీలతో పాటు 97 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెరీర్ లో గొప్ప గణాంకాలు ఉన్న ఈ పాక్ మాజీ మాటలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏంటీ షేక్ హ్యాండ్ వివాదం:

ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌‌‌‌లో  పరిణామాలు రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. టాస్ టైమ్‌‌‌‌లో ఇండియా కెప్టెన్‌‌‌‌ సూర్యకుమార్ యాదవ్, పాక్ సారథి సల్మాన్ అలీ ఆగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.  

విన్నింగ్‌‌‌‌ సిక్స్ కొట్టిన వెంటనే సూర్య నాన్‌‌‌‌ స్ట్రయికింగ్ ఎండ్‌‌‌‌లో ఉన్న శివం దూబేకు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చి నేరుగా డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌కు వెళ్లిపోయాడు. ఇండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తారని పాక్ ఆటగాళ్లు కాసేపు గ్రౌండ్‌‌‌‌లోనే వేచి చూసి వెళ్లిపోయారు. ఇండియా ఆటగాళ్ల ప్రవర్తన, మ్యాచ్ రిఫరీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పీసీబీ ఈ వివాదంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.