IND VS PAK: ఇండియాతో పాకిస్థాన్ మ్యాచ్ చూడడం దండగ.. ఆ రోజు నేను ఫుట్ బాల్ చూశా: సౌరవ్ గంగూలీ

IND VS PAK: ఇండియాతో పాకిస్థాన్ మ్యాచ్ చూడడం దండగ.. ఆ రోజు నేను ఫుట్ బాల్ చూశా: సౌరవ్ గంగూలీ

ఆసియా కప్ లో ఆదివారం (సెప్టెంబర్ 14) ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా లాంటి స్టార్ క్రికెటర్లు లేకపోయినా టీమిండియాపై పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమై సూర్య సేనకు తలవంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేధించింది. ఈ మ్యాచ్ చూసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తి చూపించలేదని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

సెప్టెంబర్ 14 న ఆదివారం జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఏకపక్షంగా ఉండటం వల్ల చూడలేదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన తెలిపాడు. ఒక ఈవెంట్ సందర్భంగా మాట్లాడుతూ గంగూలీ ఇలా అన్నాడు.. "నేను మ్యాచ్ చూడకపోయినా అందులో ఆశ్చర్యం లేదు. నిజం చెప్పాలంటే నేను మొదటి 15 ఓవర్ల తర్వాత ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ చూడడం ఆపేశాను. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో జరుగుతున్న మాంచెస్టర్ యునైటెడ్, మ్యాన్ సిటీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చూశాను". అని గంగూలీ అన్నాడు. 

ఈ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ క్షీణత గురించి మాట్లాడాడు. పాకిస్తాన్ క్రికెట్ లో ఇకపై ఇండియాకు పోటీ కాదని అయన అన్నారు.  "పాకిస్తాన్ పోటీ కాదని ఖచ్చితంగా చెప్పగలను. నేను గౌరవంగా చెబుతున్నాను. వారి జట్టు చాలా పేలవంగా ఉంది. పాక్ జట్టులో అసలు క్వాలిటీ ప్లేయర్లు లేరు. పాకిస్థాన్ కంటే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ చూడడానికి నేను ఆసక్తి చూపిస్తాను. గత ఐదేళ్లుగా ఇండియా, పాక్ మ్యాచ్ పై హైప్ తీసుకొస్తూనే ఉన్నారు. కానీ ఇది వన్-వే ట్రాఫిక్". అని ఈ టీమిండియా మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. 

ALSO READ : Asia Cup 2025: ఇండియాలోని ఆ రెండు రాష్ట్రాలు పాకిస్థాన్‌ను ఓడించగలవు: దాయాధి దేశానికి పఠాన్ కౌంటర్

ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ ఆసియా కప్ గ్రూప్-ఏ లో ఉన్నాయి. రెండు విజయాలతో ఇండియా ఇప్పటికే సూపర్-4 కు అర్హత సాధించగా.. యూఏఈపై బుధవారం (సెప్టెంబర్ 17) జరగబోయే మ్యాచ్ గెలిస్తేనే పాకిస్థాన్ సూపర్-4 కు వెళ్తుంది. పాకిస్థాన్ సూపర్-4 కు అర్హత సాధిస్తే మరోసారి ఇండియా- పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 లో ఈ రెండు జట్లు టాప్-2 లో నిలిస్తే సెప్టెంబర్ 28 న ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి.