జూబ్లీహిల్స్: ఎలక్ట్రిక్, విదేశీ సిగరెట్లు స్వాధీనం

జూబ్లీహిల్స్: ఎలక్ట్రిక్, విదేశీ సిగరెట్లు స్వాధీనం

జూబ్లీహిల్స్, వెలుగు: నిషేధిత ఈ–సిగరెట్లు, విదేశీ సిగరెట్లను పోలీసులు సీజ్​ చేశారు. కేరళకు చెందిన మహమ్మద్‌‌ మునీర్‌‌(26), అబ్దుల్‌‌ రెహమాన్‌‌ మిహ్రాజ్‌‌(25), మహమ్మద్‌‌ ఇయాస్‌‌(19) కొంతకాలంగా బంజారాహిల్స్​ శ్రీనగర్‌‌ కాలనీలో స్మోకర్స్‌‌ ఇన్‌‌ షాపు నిర్వహిస్తున్నారు. 

నిషేధిత ఈ-సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. టాస్క్‌‌ఫోర్స్‌‌ జూబ్లీహిల్స్‌‌ జోన్‌‌, బంజారాహిల్స్‌‌ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్‌‌ చేశారు. 53 వేప్స్‌‌, 10 లిక్విడ్స్‌‌, 76 బాక్సుల విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.