ఓల్డ్‌సిటీ, వెలుగు: రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాకుత్‌పురా ముర్తుజా నగర్‌లో నిషేధిత చైనీస్ మాంజా విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రావు పర్యవేక్షణలో రైన్‌బజార్ పోలీసులు దాడి చేసి హుస్సేన్ అఘా(37), సయ్యద్ సాదిక్ హుస్సేన్ జాఫరీ(35)ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సుమారు రూ.లక్ష విలువైన 191 బాక్స్‌ల చైనీస్ మాంజా బాబిన్స్ తో ఉన్న నాలుగు కార్టన్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు.
రహమత్‌నగర్‌లో 26 బాబిన్లు..
జూబ్లీహిల్స్: నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న వ్యక్తిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రహమత్‌నగర్‌కు చెందిన సయ్యద్ అతిక్ అహ్మద్(42) సైకిల్ షాప్ నిర్వహిస్తూ సంక్రాంతి సందర్భంగా అక్రమంగా మాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ సాయికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో మోనోఫిల్ గోల్డ్ నైలాన్ చైనీస్ మాంజా 26 బాబిన్లు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.41,600 ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు.
