
సైబర్ క్రైమ్ రోజురోజుకు కొత్త దారులు తొక్కుతుంది. పోలిసులు ఎన్ని చర్యలు తీసుకున్న కొత్త కొత్త విధంగా పుట్టుకొస్తున్నాయి. తాజాగా సైబర్ క్రైమ్ నేరస్థులకు సహకరించిన ఓ ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ బరేలీలోని ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ సింగ్ కంపెనీ బ్యాంక్ అకౌంటును సైబర్ కేటుగాళ్లకు అద్దెకు ఇచ్చినందుకు అరెస్ట్ అయ్యారు. 11 రాష్ట్రాలలోని బాధితుల నుండి రూ.3.2 కోట్లను కాజేసిన చేసిన ఈ సైబర్ నేరస్థులు వాటిని వెంటనే USDT క్రిప్టోకరెన్సీగా మార్చారు అలాగే హాంగ్‌కాంగ్‌లోని డిజిటల్ వాలెట్లకు మళ్లించారు. దీంతో ఈ డబ్బును తిరిగి రాబట్టడం పోలీసులకు కష్టంగా మారింది.
బరేలీ పోలీసుల ప్రకారం, నారాయణి ఇన్‌ఫ్రాటెక్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ సింగ్ కంపెనీ అకౌంటును సైబర్ మోసాలకు ఉపయోగించుకునేందుకు సహకరించినందుకు రూ.75,000 అందుకున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని పోలీసు విభాగాలు అతని కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నాయి.
సైబర్ సెల్ SHO దినేష్ శర్మ దర్యాప్తు వివరాలను వెల్లడిస్తూ ఈ మోసం ద్వారా పొందిన రూ.3.2 కోట్లు జూన్ 18 నుండి 19 తేదీల్లో నారాయణి ఇన్‌ఫ్రాటెక్ బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇందులో రూ.1.1 కోట్లు బరేలీలోని IVRIలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఖాతా నుండి వచ్చాయి, అతన్ని మోసగాళ్ళు డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేశారు. మిగిలిన మొత్తాన్ని ఇతర రాష్ట్రాల నుండి మోసాల ద్వారా వచ్చాయి. జూన్ 20న డబ్బు మొత్తాన్ని ఖాతా నుండి విత్ డ్రా చేసుకున్నారు తరువాత అకౌంట్లు బ్లాక్ చేసినట్లు తెలిపారు.
కేసు దర్యాప్తు అధికారులు అనుమానితుల నుండి మూడు మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్రిప్టో వాలెట్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనుమానితులకి అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో కనెక్షన్ ఉండొచ్చని ప్రస్తుతం క్రిప్టో వాలెట్‌ను విశ్లేషిస్తున్నారు, ప్రాథమిక పరిశోధనలు చైనాలో కార్యకలాపాలు చూపిస్తున్నాయి. దర్యాప్తు జరుగుతుంది, మొత్తం నెట్‌వర్క్‌ను త్వరలో బయటపెడతాం" అని ఎస్పీ మనీష్ సోంకర్ అన్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ కాగా, ప్రదీప్ కుమార్ సింగ్‌తో పాటు, మహఫూజ్, అమన్‌లను ఆదివారం అరెస్టు చేసారు. గతంలో లక్నో, మీర్జాపూర్, బుడాన్‌తో సహా వివిధ జిల్లాల నుండి మరో ఆరుగురుని అరెస్టు చేసారు.