
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటికి మరో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ ఎడ్యుకేషన్ అవార్డు 2019 అవార్డుకు ట్రిపుల్ ఐటీ ఎంపికైంది. ఈనెల 11న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నారు ట్రిపుల్ ఐటీ కాలేజీ వీసీ అశోక్. నాణ్యమైన బోధన, అత్యున్నత స్థాయి వసతులతో పాటు 50 శాతం మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు సాధించడంతో ఈ ఘనత దక్కిందన్నారు వీసీ అశోక్.