ENG vs IND: రిషబ్ పంత్‌ను గుర్తు చేసిందిగా.. వన్ హ్యాండెడ్ సిక్సర్‌తో దీప్తి స్టన్నింగ్ షాట్

ENG vs IND: రిషబ్ పంత్‌ను గుర్తు చేసిందిగా.. వన్ హ్యాండెడ్ సిక్సర్‌తో దీప్తి స్టన్నింగ్ షాట్

క్రికెట్ లో వన్ హ్యాండెడ్ సిక్సర్ అంటే టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అందరికీ గుర్తుకొస్తాడు. వన్ హ్యాండ్ తో అద్భుతమైన సిక్సర్లు కొడుతూ ఫ్యాన్స్ కు పిచ్చ కిక్ ఇస్తాడు. పంత్ షాట్ నే టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ కొట్టి చూపించింది. బుధవారం (జూలై 16) ఇంగ్లాండ్ మహిళలతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ వన్ హ్యాండ్ తో కొట్టిన సిక్సర్ వైరల్ గా మారుతోంది. టీమిండియా ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 38 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

లారెన్ బెల్ వేసిన స్లాట్ డెలివరీని మిడ్ వికెట్ మీదుగా తన బాటమ్ హ్యాండ్‌ను ఉపయోగించి సింగిల్ హ్యాండ్ తో భారీ షాట్ కొట్టింది. కనెక్షన్ సరిగ్గా కుదరడంతో డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ వెళ్ళింది. ఈ సిక్సర్ పంత్ ను గుర్తు చేసింది. మ్యాచ్ తర్వాత కూడా దీప్తి శర్మ తాను వన్ హైడ్ సిక్సర్ కొట్టడానికి రిషప్ పంత్ స్ఫూర్తి అని తెలిపింది. పంత్ బ్యాటింగ్ చూసి అతనిలా సిక్సర్ లు కొట్టాలని ఉండేది. ఆ ప్రభావంతోనే నెట్స్ లో వన్ హ్యాండెడ్ సిక్సర్ ప్రాక్టీస్ చేసేదాన్ని అని దీప్తి వెల్లడించింది. ఈ మ్యాచ్ లో 64 బంతుల్లో 62 పరుగులు చేసిన దీప్తి శర్మ టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచింది. 

 

ALSO READ : Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం.. నివేదికలో కోహ్లీ పేరు ప్రస్తావన

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  సోఫియా డంక్లీ, డేవిడ్సన్ రిచర్డ్స్, హాఫ్ సెంచరీలు చేయడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 259 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి గెలిచింది. దీప్తి శర్మ 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. జెమిమా రోడ్రిగ్స్ 48 పరుగులు చెడి కీలక ఇన్నింగ్స్ ఆడింది.