
YouTube ప్రపంచంలోని రెండవ అతిపెద్ద సెర్చ్ ఇంజన్..రోజుకు 122 మిలియన్ యాక్టివ్ యూజర్లతో బిజినెస్, కంటెంట్ క్రీయేటర్స్ కు ఫాలోవర్స్, కస్టమర్లను సంపాదించేందుకు అవకాశం ఇస్తోంది.YouTube ఛానల్ ద్వారా బిజినెస్ తో తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవచ్చు. ప్రాడక్టులను డిస్ ప్లే చేస్తూ కస్టమర్లను పెంచుకోవచ్చు. ఇలా 83శాతం చిన్న వ్యాపారాలు YouTube ద్వారా కస్టమర్లను పెంచుకున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్, లైకులు రావడంలేదని ఫీలవుతుంటారు. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు, సలహాలు. యూట్యూబ్ నిర్వాహకులు ఈ ఐదు తప్పులు చేయకుండా ఉంటే ఎక్కవమంది ఫాలోవర్లను సంపాదించొచ్చు.
తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్ ,క్లిక్‌బైట్ శీర్షికలు అస్సలు వద్దు..
ఆకర్షణీయమైన థంబ్‌నెయిల్స్ ,అతిశయోక్తి శీర్షికలను ఉపయోగించడం వల్ల మీకు తాత్కాలికంగా వీక్షణలు పెరగవచ్చు.కానీ కాలక్రమేణా ప్లాట్‌ఫాంపై ఫాలోవర్లకు నమ్మకం తగ్గవచ్చు. ప్రస్తుతం వ్యూవర్స్ చాలా తెలివిగా మారుతున్నారు. ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేస్తున్న ఏదైనా క్లిక్ బైట్ కంటెంట్‌ను సులభంగా గుర్తించగలరు.
మీ కంటెంట్ థంబ్‌నెయిల్ లేదా టైటిల్‌తో సరిపోలకపోతే, వీక్షకులు ఊహించిన దానికంటే ముందుగానే వీడియోలను చూడకుండా వదిలి వెళ్ళవచ్చు. ఇది ప్లాట్‌ఫాంలో వ్యూస్ టైం,ర్యాంకింగ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.
వైరల్ కంటెంట్‌ను కాపీ-పేస్ట్ చేయొద్దు..
ఆసక్తి కలిగించే వైరల్ కంటెంట్ ను ఎక్కువగా కాపీ చేస్తుంటారు. కానీ YouTube కాపీరైట్ నియమాలకు విరుద్ధం . మీరు అనుమతి లేకుండా వేరొకరి కంటెంట్‌ను ఉపయోగిస్తే మీ ఛానెల్ ను పర్మినెంట్ బ్యాన్ చేయొచ్చు. వీడియో క్రియేటర్స్ ట్రెండింగ్ అంశాలపై వారి ప్రత్యేకమైన ట్విస్ట్‌ను ఉపయోగించాలి. సేఫ్, ఒరిజినల్ YouTube కోసం రీమిక్స్ లేదా షార్ట్స్ ఫీచర్‌ను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మనీ మేకింగ్ రూల్స్ తప్పక పాటించాలి..
భారత్ లో భిన్న భాషలు, విభిన్నమైన మతాలు ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్స్ తప్పకుండా కమ్యూనిటీ రూల్స్ పాటించాలి. ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుదారి పట్టించే ఆరోగ్య సలహాలు, హింసాత్మక కంటెంట్ వంటి ఖచ్చితంగా నిషేధించాలి. అలాంటి వాటిని అప్‌లోడ్ చేయొద్దు. అలా చేస్తే మీ ఛానల్ బ్లాక్ చేయబడుతుంది. YouTube రూల్స్ ఉల్లంఘించడం అనేది మీకు డీమోనిటైజ్ కు మీ ఛానల్ తక్షణమే తొలగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మీరు YouTube భాగస్వామి ప్రోగ్రామ్ (YPP) కోసం దరఖాస్తు చేసేటప్పుడు ప్లాట్‌ఫాం మానిటైజేషన్ విధానాలను తప్పకుండా చదవాలి.
లైక్‌లు,సబ్‌స్క్రిప్షన్ల కోసం రిక్వెస్ట్ లు పెట్టొద్దు..
మీరు మీ ప్రేక్షకులను లైక్ చేసి సబ్‌స్క్రైబ్ చేయమని అడిగితే పర్వాలేదు.. కానీ వారిపై ఒత్తిడి తేవద్దు. మీరు పదే పదే బలవంతం చేస్తుంటే అది నిరాశకు గురిచేస్తుంది ,YouTube కూడా నిషేధం విధించవచ్చు. వ్యూవర్స్ స్వచ్ఛందంగా పాల్గొనేలా చేసే విలువైన కంటెంట్‌ను సృష్టించడంపై దృష్టి పెట్టాలి.
అస్థిరమైన లేదా నాణ్యత లేని కంటెంట్‌ను అప్‌లోడ్ చేయవద్దు.
YouTube అల్గోరిథం వీడియోలను క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆడియో అస్పష్టంగా ఉన్నా, లైటింగ్ పేలవంగా ఉన్నా లేదా కంటెంట్ అస్పష్టంగా ఉన్నా వ్యూవర్స్ వీడియో లేదా పేజీకి తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని కంటెంట్ క్రియేటర్స్ గమనించాలి.
సహజ కాంతితో పాటు, ఒరిజినల్ ఆడియోతో ఒరిజినల్ కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు ట్రాక్షన్ పొందడానికి వీడియోలను చక్కగా ఎడిట్ చేయాలి. కంటెంట్ క్రియేటింగ్ మరింత పోటీ ఉన్నందున సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకునేందుకు ఇది చాలా కీలకం. సక్సెస్ ఫుల్ YouTube క్రియేటర్ గా మారడం అంటే వైరల్ అవ్వడం మాత్రమే కాదు..కాలక్రమేణా నమ్మకం ,ప్రామాణికతను పెంపొందించడం కూడా. ఇది అందరికి తెలుసు.
YouTube మారుతున్న విధానాలతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. మీ ప్రేక్షకుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. ఒరిజినల్, విలువైన కంటెంట్‌పై దృష్టి పెట్టాలి. అలాగే షార్ట్‌కట్‌లను తగ్గిస్తే లైక్‌లు, వ్యూస్ ,సబ్‌స్క్రైబర్ బేస్ క్రమంగా పెరుగుతుందంటున్నారు యూట్యూబ్ నిపుణులు.