ఇంటర్ స్పాట్ రెమ్యునరేషన్ 25% పెంపు..ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు 

ఇంటర్ స్పాట్ రెమ్యునరేషన్ 25% పెంపు..ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పరీక్షల నిర్వహణతో పాటు స్పాట్ వ్యాల్యుయేషన్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్‌‌ను ఇంటర్ బోర్డు పెంచింది. గతంలో ఉన్న దానికి 25 శాతం మేర అదనంగా పెంచుతూ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన ఈ కొత్త రేట్లు మార్చి 2026 నుంచి జరిగే ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంపు నుంచి అమల్లోకి రానున్నట్టు ప్రకటించారు.

అయితే, మొత్తం 31 కేటగిరీలకు చెందిన సిబ్బందికి పారితోషికం పెరిగింది. ఇందులో క్యాంప్ ఆఫీసర్లు, సబ్జెక్ట్ ఎక్స్‌‌పర్ట్స్, హెచ్‌‌పీపీ మెంబర్లు, డీఈసీ మెంబర్లకు రోజుకు రూ.800 నుంచి రూ.వెయ్యికి పారితోషికం పెంచారు. పరీక్షా కేంద్రాల్లో పనిచేసే చీఫ్ సూపరింటెండెంట్లకు సెషన్‌‌కు రూ. 440, ఇన్విజిలేటర్లకు రూ. 235 చొప్పున చెల్లించనున్నారు. పేపర్ దిద్దే అసిస్టెంట్ ఎగ్జామినర్లకు ఒక్కో స్క్రిప్ట్‌‌కు రూ.29.57, స్క్రూటినైజర్లకు రూ. 5.75 పెంచారు.