ఓల్డ్‌సిటీ, వెలుగు: హైదరాబాద్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడిలో భారీ స్థాయిలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసి సుమారు రూ.2.5 లక్షల విలువైన అల్లంపేస్ట్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. టప్పాచబుత్రా మలైమెట్ ప్రాంతంలోని ‘సహారా ఇండియా’ పేరిట నడుస్తున్న కేంద్రంలో మొహమ్మద్ జాఫర్ ఆలయ(42) కల్తీ పేస్ట్ తయారు చేస్తున్నాడు.
హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్(ఖైరతాబాద్ జోన్) బృందం ఇన్‌స్పెక్టర్ పి.రాఘవేందర్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అల్లం-వెల్లుల్లి పేస్ట్‌లో సిట్రిక్ యాసిడ్, అధిక ఉప్పు వంటి రసాయనాలు కలిపి కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. 1,155 కిలోల కల్తీ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
