
మెంటల్‌గానే కాదు... ఫిజికల్‌గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటే పాజిటివ్ మైండ్ సెట్ చాలా ముఖ్యం. లైఫ్ లో ప్రతి విషయంలో పాజిటివ్ గా ఉంటే ఎక్కువ సంతోషంగా ఉండగలుగుతారు. దీనివల్ల డిప్రెషన్, బీపీలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. దీన్ని అలవర్చుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి.
రోజును హ్యాపీగా, పాజిటివ్ ఆలోచనలతో ప్రారంభించండి. అంతేకానీ, నెగెటివ్ ఆలోచనలతో, నిరాశతో మొదలుపెట్టొద్దు. ఉదయం లేవగానే ఆ రోజు ఉన్న ముఖ్యమైన పని గురించి అనవసరంగా టెన్షన్ పడొద్దు. నెగెటివ్ ఆలోచనలు ఇబ్బంది పెడుతుంటే అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. ఇది కాస్త విచిత్రంగా అనిపించినా బాగా పనిచేస్తుంది.
- రోజులో ఎదురయ్యే ఇబ్బందుల్ని కూడా పాజిటివ్ గా ఆలోచించండి. అంటే ట్రాఫిక్ లో ఇరుక్కుంటే చిరాకుపడకుండా, ఒక పని గురించి ఆలోచించేందుకు మరికాస్త సమయం దొరికిందనుకోండి.
- ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి మీమీద మీరే జోక్ వేసుకోవాలి. ఈ ప్రతికూల పరిస్థితే ఫ్యూచర్లో ఒక మంచి కథగా మిగిలిపోతుంది. దీనికి గతంలో వచ్చిన పరిస్థితులను గుర్తు చేసుకుని వాటిని అధిగమించిన తీరును గుర్తు తెచ్చుకుంటే చాలు.
- మనం పర్ ఫెక్ట్ కాదు. అందుకే తప్పులుచేస్తాం. ఫెయిలైనందుకు బాధపడకుండా... ఫెయిల్యూర్స్ ను పాఠాలుగా మలుచుకోవాలి.
- 'నేను వేస్ట్. ఈ పని నా వల్ల కాదు.. అని నెగెటివ్ మాటలను ఆపేసి.. .నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలి. నేను ఇది ట్రై చేయాలి.. అని పాజిటివ్ టాక్ కి మారిపోవాలి.
- గతం గురించి పట్టించుకోకుండా... భవిష్యత్తు గురించి భయపడకుండా ప్రజెంట్ పై ఫోకస్ చేయాలి
ALSO READ : అమ్మాయిలు ఆఫీసుల్లో ఎలా మాట్లాడాలంటే.. ఆ మాటలే మిమ్మల్ని గెలిపించాలి.. సారీలు ఎక్కువ చెప్పొద్దు..!
-వెలుగు,లైఫ్-