
ప్రస్తుత కాలంలో రుణాన్ని తీసుకోవటం ఎంత అత్యవసరంగా మారిదో దానిని చెల్లించటం కూడా అంతే ముఖ్యం. ఇది నెలవారీ చేతికి వచ్చే మెుత్తాన్ని పెంచటంతో పాటు రుణాల భాన్ని తగ్గిస్తుంది. అలాగే మీరు బాధ్యతాయుతంగా రుణాల పట్ల ప్రవర్తిస్తున్నట్లు సంకేతాలను ఆర్థిక సంస్థలకు తెలియజేస్తుంది. అయితే రుణాన్ని చెల్లించాక కూడా అది యాక్టివ్ స్టేషన్ లో ఉన్నట్లు క్రెడిట్ రిపోర్టులో కనిపిస్తే దానిని వెంటనే సరిదిద్దేందుకు చర్యలు చేపట్టడం చాలా ముఖ్యం. ఇది మీ క్రెడిట్ వర్థీనెస్ కు ప్రమాదాన్ని కలిగించవచ్చు.
సాధారణంగా రుణ సంస్థలు ప్రతి 30 నుంచి 60 రోజుల మధ్య క్రెడిట్ బ్యూరో సంస్థలకు రుణాలకు సంబంధించిన డేటాను అందిస్తుంటాయి. మీ లోన్ క్లోజ్ అయితే ఆ వివరాలు క్రెడిట్ బ్యూరో సంస్థలకు అందగానే వారు అప్ డేట్ చేస్తారు. అప్పటి వరకు రుణం యాక్టివ్ స్టేటస్ లోనే ఉంటుంది. అయితే ఇందులో ఆలస్యం జరిగితే మీరు ఎక్కువ క్రెడిట్ యుటిలైజేషన్ కలిగి ఉండటం సిబిల్ రిపోర్టును దెబ్బతీయవచ్చు.
Also Read:-వర్క్ ఫ్రం ఆఫీసుపై టెక్కీ ఆవేదన.. వర్షాకాలంలో జీతం ఉబెర్, ర్యాపిడోకే సరిపోతోందని వెల్లడి!
ఇలాంటి సందర్భాల్లో ముందుగా మీరు రుణాన్ని అందించిన సంస్థను సంప్రదించటం ఉత్తమం. వారి నుంచి మీ లోన్ క్లోజ్ అయినట్లు పరిశీలించుకుని.. దానికి సంబంధించిన ఎన్ఓసీ సర్టిఫికెట్ పొందండి. ఆ తర్వాత దీనిని క్రెడిట్ బ్యూరో సంస్థలకు అందించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం క్రెడిట్ బ్యూరో సంస్థ అధికారిక వెబ్ పోర్టల్ లో సమస్య పరిష్కారాన్ని ఎంచుకుని తగిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేస్తే సరిపోతుంది. సాధారణంగా మూడు వారాల్లోపు ఈ సమస్యను వారు పరిష్కరిస్తారు.
ఒక్కసారి క్రెడిట్ బ్యూరో సంస్థ రుణ చెల్లింపును నిర్థారించుకున్నాక దానిని అప్ డేట్ చేస్తుంది. దీంతో మీ సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ బూస్ట్ అవుతుంది. అలాగే నెలకు ఒకసారి మీ సిబిల్ రిపోర్టులు చెక్ చేసుకోవటం ద్వారా ఇలాంటి తప్పిదాలను ఎప్పటికప్పుడు చూసుకునేందుకు వీలుంటుంది. ఒక వేళ సమస్యను క్రెడిట్ బ్యూరో సంస్థ సరిచేయకపోతే మీరు రిజర్వు బ్యాంక్ ద్వారా బ్యాంకింగ్ అంబర్ట్స్నెన్ ను సంప్రదించవచ్చు.
ఇలా సకాలంలో స్పందించటం వల్ల మీ సిబిల్ స్కోర్ సరిచేయబడి భవిష్యత్తులో రుణాలు పొందటం సులభతరం అవుతుంది. మంచి చెల్లింపుల క్రెడిట్ హిస్టరీ ఉంటే మీకు ఆర్థిక సంస్థల నుంచి క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో పాటు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు అందుతాయి. అలాగే రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవటం, ఉన్న రుణాల చెల్లింపులను సకాలంలో చేయటం వల్ల వ్యక్తుల క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని గుర్తుంచుకోండి.