- బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్న మంత్రివర్గం
హైదరాబాద్, వెలుగు : ఈ నెల 20వ తేదీన రాష్ట్ర కేబినెట్భేటీ కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 9.30 గంటలకు మీటింగ్ జరగనుందని సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు దానికి మంత్రివర్గ ఆమోదం తీసుకుంటారు. అంతేగాక, ఈసారి బడ్జెట్ఎంత పెరుగుతుందనే దానిపైనా కూడా చర్చ జరుగుతోంది.
ఈసారి పెద్దగా కొత్త స్కీములేవి పెట్టడం లేదని తెలుస్తోంది. ఉన్న స్కీములకే కేటాయింపులు పెంచనున్నట్లు సమాచారం. రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.3.20 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.
