వర్క్ ఫ్రం ఆఫీసుపై టెక్కీ ఆవేదన.. వర్షాకాలంలో జీతం ఉబెర్, ర్యాపిడోకే సరిపోతోందని వెల్లడి!

వర్క్ ఫ్రం ఆఫీసుపై టెక్కీ ఆవేదన.. వర్షాకాలంలో జీతం ఉబెర్, ర్యాపిడోకే సరిపోతోందని వెల్లడి!

నగరాల్లో జీవితం ఎంత అందంగా కనిపిస్తుందో.. అంతే ఖరీదైనది కూడా. ఏమీ ఖర్చు చేయకూడదు అని బయటకు వెళ్లినా ఏదో ఒక ఖర్చు వెంటాడుతూనే ఉంటుంది. మహానగరాల్లో ఆఫీసులకు కనీసం 15 కిలోమీటర్ల దూరం నుంచి చాలా మంది ఉద్యోగులు వెళుతుంటారు. దానికి కారణం ఆఫీసులకు చుట్టుపక్కల ఉండే అధిక అద్దెలే. వర్షా కాలంలో ఈ కష్టాలు మరింత దారుంగా ఉంటుంటాయి. 

తాజాగా పూణేలో నివసిస్తున్న ఒక టెక్కీ తమ వర్క్ ఫ్రం ఆఫీసు కష్టాల గురించి లింక్డిన్ ఖాతాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కరోనా ముగియటంతో కొన్ని నెలల నుంచి దేశంలోని అన్ని కంపెనీలు తమ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావాలని సూచించాయి. అయితే మెట్రో నగరాల్లో ఉంటున్న ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులకు మాత్రం ఇది ఆర్థిక భారాన్ని పెంచటంతో పాటు వర్షాకాలంలో కొత్త తలనొప్పులను తెస్తోందని సదరు టెక్కీ చెప్పాడు.

ALSO READ : క్రెడిట్కార్డ్కావాల్సిందే!..తక్కువ ఆదాయం ఉన్నోళ్లకు ఇదే ఆధారం..93శాతం మంది పరిస్థితి ఇదే 

కంపెనీలు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ అందించలేకపోతే వారి ప్రయాణానికి అయ్యే ఖర్చులను ట్రావెల్ అలవెన్స్ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశాడు. వర్షం సమయంలో నీళ్లతో నిండిపోయిన రోడ్లలో క్యాబ్స్, ఆటోలు క్యాన్సిలేషన్స్ నరకం చూపిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ లక్షలు వేతనంగా అందుకోరని, నెలకు రూ.25వేల జీతంతో బ్రతికే వారు ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో చాలా మంది యువత ఉంటారని సదరు టెక్కీ చెప్పుకొచ్చారు.

వర్షం సమయంలో జలయమైన రోడ్లలో ప్రయాణించటానికి రోజుకు ఉబెర్ ఖర్చు రూ.500 కంటే ఎక్కువగా ఉంటోందని. ఒక్క నెలకు తన ప్రయాణ ఖర్చే రూ.10వేలకు మించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా యువ ఉద్యోగులు సగం డబ్బు వేస్ట్ చేసుకోకుండా వారికి వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని కంపెనీలు కల్పించాలన్నారు. అందరూ ఆఫీసులకు దగ్గరే ఉండరని.. అదే పని, అదే మీటింగ్స్, అదే ల్యాప్ టాప్ తెరచి చేయటానికి సగం డబ్బు జీతం వృధా కావటం అన్యాయం అని అన్నారు. కంపెనీలో ఉద్యోగులను నిజంగా కుటుంబ సభ్యులుగా భావించనప్పుడు వారిని అలా పిలవటం తప్పేనన్నాడు టెక్కీ. అర్థం చేసుకుని ట్రావెల్ ఖర్చులను కంపెనీలు అందించాలని చెప్పాడు పూణేకు చెందిన టెక్కీ.