వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్లో ఇకనుంచి పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్.. దొరికితే 25 ఏళ్ల వరకు..

వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్లో ఇకనుంచి పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్.. దొరికితే 25 ఏళ్ల వరకు..

హైదరాబాద్ లో వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల విషయంలో మరింత స్పీడ్ పెంచేందుకు సిద్ధమవుతున్నారు. మరింత దూకుడుగా ఎనీటైమ్.. ఎనీవేర్ అన్నట్లుగా తనిఖీలు చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు V6తో సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. 

బుధవారం (జులై 16) V6 తో సీపీ మాట్లాడుతూ.. హైద్రాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సర్ప్రైజ్ డే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వీకెండ్స్ నైట్ మాత్రమే చేస్తారు అనే భావనలో ప్రజలు ఉన్నారు.. ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందని నైట్ టైంలో చేస్తాము.. కానీ ఇక నుంచి డే టైమ్ లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.

జూన్ నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో స్కూల్ బస్ డ్రైవర్ లు మద్యం సేవించి పట్టుబడటం ఆందోళన కలిగించిందని అన్నారు. 35 మంది స్కూల్ బస్ డ్రైవర్లు పట్టపగలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం షాక్ కి గురి చేసిందని అన్నారు. బస్, వ్యాన్, ఆటో డ్రైవర్లు ఉదయం వేళలో మద్యం సేవించి వాహానాలు నడుపుతునట్లు గుర్తించినట్లు చెప్పారు. 

ఉదయం వేళల్లో స్కూల్ బస్ డ్రైవర్లు, ఇతర వ్యాన్, ఆటో డ్రైవర్లు మద్యం సేవించి నడపటం వలన ప్రమాదాలు పెరుగుతున్నాయని.. ఇకనుంచి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రుల్లోనే కాదు.. ఉదయం కూడా కొన్ని ఏరియాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని భావించినట్లు V6 కు చెప్పారు. ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు లేకుండా పగటిపూట సర్ప్రైజ్ డ్రంక్ ఎండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. 

మైనర్లపై స్పెషల్ ఫోకస్:

మైనర్ లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ చెప్పారు. మైనర్స్ డ్రైవింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. మొత్తం 4500 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు.. 2800 వాహనాల వెహికిల్  రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేందుకు ట్రాన్స్ పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. అందులో 863 వెహికిల్ రెజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. మైనర్స్ డ్రైవింగ్ లో పట్టుబడితే 25 ఏండ్ల వరకు లైసెన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 

మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా వారి ప్రాణాలు కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని.. అందుకే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచిస్తున్నట్లు సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు.