స్కిల్స్ ఉన్నోళ్లకే హెచ్ 1బీ వీసాలు.. లాటరీ సిస్టమ్ రద్దు చేసిన అమెరికా

స్కిల్స్ ఉన్నోళ్లకే హెచ్ 1బీ వీసాలు.. లాటరీ సిస్టమ్ రద్దు చేసిన అమెరికా
  •  అమెరికా కీలక నిర్ణయం

వాషింగ్టన్: ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న హెచ్‌‌1బీ వీసా కేటాయింపు విధానంలో ట్రంప్‌‌ సర్కారు కీలక మార్పులు చేసింది. హెచ్‌‌1బీ వీసాల ఎంపికలో వినియోగిస్తున్న లాటరీ సిస్టమ్‌‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే ప్లేస్‌‌లో ఎక్కువ నైపుణ్యం కలిగిన, అధిక వేతనాలు పొందగలిగే విదేశీయులకు ప్రాధాన్యతనిచ్చే వెయిటెడ్‌‌ సెలక్షన్‌‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. 

ఇది 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నట్లు యూఎస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ హోమ్‌‌ల్యాండ్‌‌ సెక్యూరిటీ ప్రకటించింది. అయితే, కొత్త సిస్టమ్‌‌ వల్ల ఎంట్రీ లెవెల్‌‌ ఉద్యోగాలకు అప్లయ్‌‌ చేసే వారికి, ముఖ్యంగా భారతీయులకు అమెరికా వర్క్‌‌ వీసా పొందటం కష్టతరం కానుంది.