- గతేడాది వ్యూహాత్మక రక్షణ ఒప్పందమే కారణం
- అవసరమైతే సంయుక్త ప్రతిదాడి అవకాశం
- అణు రక్షణ ఉంటుందా..? అనే అనుమానం!
- ఇరాన్ సౌదీపై దాడి చేయొద్దన్న పాక్ విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పెరుగుతున్నయుద్ధ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ పాత్రపై చర్చ మొదలైంది. గతేడాది సెప్టెంబ రులో సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం ఏ దేశంపై దాడి జరిగినా రెండు దేశాలపై దాడిగా పరిగణించి సంయుక్తంగా ప్రతిస్పందించాలి. ఈ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ సౌదీపై దాడి చేస్తే పాకిస్తాన్ యుద్ధంలో దిగుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇరాన్ కు హెచ్చరిక జారీ చేశారు. “సౌదీతో మాకు రక్షణ ఒప్పందం ఉంది” అని ఆయన చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. యుద్ధంలో నేరుగా పాల్గొంటామని పాకిస్తాన్ ఇప్పటివరకు ప్రకటించలేదు.
►ALSO READ | అమెరికాకు చుక్కలు చూపించిన ఇరాన్ ..48 గంటల్లో 9 యూఎస్ బేస్ లు ధ్వంసం
ఈ ఒప్పందం లో అత్యంత వివాదాస్పద అంశం పాకిస్తాన్ తన అణు రక్షణను సౌదీకి విస్తరించే అవకాశంపై ఉన్న అనుమానాలే. దీనివల్ల అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం నిబంధనలు దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ యుద్ధంలో నేరుగా దిగకపోయినా సౌదీకి దౌత్యపరంగా బలమైన మద్దతు ఇవ్వొచ్చనే భావన ఉంది.
