అమెరికాకు చుక్కలు చూపించిన ఇరాన్ ..48 గంటల్లో 9 యూఎస్ బేస్ లు ధ్వంసం

అమెరికాకు చుక్కలు చూపించిన ఇరాన్ ..48 గంటల్లో 9 యూఎస్ బేస్ లు ధ్వంసం

టెహ్రాన్: అమెరికా బేస్ లే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగింది. కేవలం మానవ రహిత డ్రోన్లను ప్రయోగిస్తూ అమెరికాకు చుక్కలు చూపించింది. యుద్ధం ప్రారంభమైన కేవలం 48 గంటల వ్యవధిలో 9 అమెరికన్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 

ఈ ఎయిర్ బేస్ లన్నీ గల్ఫ్ దేశాల్లో ఉండటం గమనాహం. యూఏఈలో రెండు, బహ్రెయిన్, ఖతార్, ఇరాక్ లో ఒక్కోటి, కువైట్ లో నాలుగు ఎయిర్ బేస్ లు ఉన్నాయి. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా డ్రోన్లతో ఇరాన్ విరుచుకు పడింది. ఈ దాడుల్లో ఎన్ఎస్ఏ బహ్రెయిన్ ధ్వంసం కావడంతో అమెరికన్ భద్రతా వ్యవస్థలోని శాటిలైట్ కమ్యూనికేషన్స్ దెబ్బతిన్నాయి. అదే విధంగా కువైట్ లోని షు అయిబా ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలో ఆరుగురు అమెరికన్ సైనికులు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు.

ధ్వంసమైన ఎయిర్ బేస్ లు ఇవే

  • అల్ ధఫ్రా ఎయిర్ బేస్, యూఏఈ
  • పోర్ట్ ఆఫ్ జెబెల్ అలీ, యూఏఈ 
  • ఎన్ఎస్ఏ బహ్రెయిన్ (శాటిలైట్ కమ్యూనికేషన్లూ ధ్వంసం)
  • అల్ యుదెయిద్ ఎయిర్ బేస్, ఖతర్ ముఅయిబా, కువైట్ (ఇక్కడ ఆరుగురు అమెరికన్ సైనికులు హతమయ్యారు)
  • అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్ 
  • కువైట్క్యాంప్ అరిప్టాన్ 
  •  కువైట్ క్యాంప్ బుయెరింగ్
  • కువైట్ఎర్బిల్ ఎయిర్ పోర్ట్, ఇరాక్

►ALSO READ | ఒరేయ్.. అది మిస్సైల్ రా.. పేలితే పోతారు.. అది తెలియక పైకెక్కి ఆడుకుంటున్నారు !