జీడిమెట్ల, వెలుగు : కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొంపల్లికి చెందిన నాగమణి (42) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈమె కూతురు మూడు నెలల కింద ప్రేమ వివాహం చేసుకుంది.
అప్పటినుంచి నాగమణి తీవ్ర మనస్థాపంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంటి వద్ద నాగమణి కనిపించకపోవడంతో ఆమె తమ్ముడు రాజు, మరికొందరితో కలిసి వెతికారు. అనుమానం వచ్చి ఫాక్స్ సాగర్ చెరువులో గాలించగా డెడ్‌బాడీ దొరికింది. మృతురాలి తమ్ముడు రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
