కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను చూసి జనం నవ్వుకుంటున్నరు : దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను చూసి జనం నవ్వుకుంటున్నరు :  దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
  •     రెండేండ్ల తర్వాత పాలమూరు ప్రాజెక్టుపై మాట్లాడుడేంది: మధుసూదన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల పాటు ఫామ్ హౌస్‌‌‌‌లో దుప్పటి కప్పుకొని పడుకున్న మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడు పాలమూరు- – రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడడం చూసి జనం నవ్వుకుంటున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. పాలమూరుకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, ఇక్కడి ప్రజలను నిండా ముంచిన ఆయనే.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. 

బుధ వారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. . 2015 జూన్ 11న దేవరకద్ర నియోజకవర్గంలోని కరివె న వద్ద కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, మూడేండ్లలో పూర్తి చేస్తానని చెప్పి.. ఆరేండ్లు గడిచినా పూర్తి కాలేదని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు, అర్హత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌‌‌‌ రావుకు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.