టైరు పేలి రెండు కార్లను ఢీకొన్న బస్సు..9మంది స్పాట్ డెడ్.. చిన్నపిల్లలకు తీవ్రగాయాలు

టైరు పేలి రెండు కార్లను ఢీకొన్న బస్సు..9మంది స్పాట్ డెడ్.. చిన్నపిల్లలకు తీవ్రగాయాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (డిసెంబర్24) అర్థరాత్రి కడలూరు జిల్లా తుత్తుకూడి దగ్గర ఆర్టీసీ బస్సు రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న 9మంది స్పాట్ లోనే చనిపోయారు. ఇద్దరు చిన్నపిల్లలు సహా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుచిరాపల్లినుండి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైరు పగిలి అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న  రెండు కార్లను డీకొట్టింది. కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురు, మరో ఇద్దరు బస్సులో ఉన్నవారు చనిపోయారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిన్న పిల్లలు, మరో ఇద్దరు క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
 
ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3లక్షలు, గాయపడ్డవారికి రూ.1లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.  మరణించిన తొమ్మిది మందిలో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న రామనాథం పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. టైర్ పగిలిపోవడానికి గల పరిస్థితులను , ఢీకొనడానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పరిశీలించారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు.