న్యూ ఇయర్ వేడుకల్లో ఇన్సిడెంట్లకు తావు లేకుండా చర్యలు : సీపీ సుధీర్ బాబు

న్యూ ఇయర్ వేడుకల్లో ఇన్సిడెంట్లకు తావు లేకుండా చర్యలు : సీపీ సుధీర్ బాబు
  • ఔట్​డోర్ ఈవెంట్లలో డీజేకు నో పర్మిషన్​
  • రాచకొండ సీపీ సుధీర్ బాబు

మల్కాజిగిరి, వెలుగు: న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీస్​ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. బుధవారం రాచకొండ పరిధిలోని పబ్ లు, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్ లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఔట్ డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజే బాక్సులకు, పటాకులు కాల్చడానికి అనుమతి లేదన్నారు. పబ్ లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయం లోపు మూయాలని, మైనర్లకు లిక్కర్​ అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు నారాయణరెడ్డి, అనురాధ, సీహెచ్.శ్రీధర్ ఆకాంక్ష్ యాదవ్, రమణారెడ్డి, ఇందిర, నరసింహారెడ్డి, ఉషా రాణి, శ్రీనివాస్, మనోహర్, శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.