హైదరాబాద్ బుక్ ఫెయిర్‌‌లో ..అంటరాని విద్య, సంగం పుస్తకాల ఆవిష్కరణ

 హైదరాబాద్ బుక్ ఫెయిర్‌‌లో ..అంటరాని విద్య, సంగం పుస్తకాల ఆవిష్కరణ

హైదరాబాద్​ సిటీ, వెలుగు :   హైదరాబాద్ బుక్ ఫెయిర్‌‌లో ప్రముఖ తెలుగు రచయిత లోక మలహరి రచించిన   అంటరాని విద్య   , సంగం పుస్తకాలను  బుధవారం సాయంత్రం  ఆవిష్కరించారు. ఈ నవలలను డా. సుమేధ ద్యావనపల్లి ఇంగ్లిష్‌‌లోకి అనువదించగా, తెలంగాణ పబ్లికేషన్స్    ప్రచురించింది.    సమ్మక్క–సారక్క కేంద్ర గిరిజన యూనివర్సిటీ వీసీ   వై.ఎల్. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాలను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  లోక మలహరి రచించిన జెగ్గని యిద్దె , సంఘం  నవలలు..  సామాజిక విమర్శకు, నైతిక విచారణకు సాహిత్యాన్ని సాధనంగా ఉపయోగించిన భారతీయ సాహిత్య సంప్రదాయానికి ఈ నవలలు చెందుతాయని, ముల్క్ రాజ్ ఆనంద్, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి సంస్కరణవాద రచయితల కథన సంప్రదాయానికి ఇవి వారసులని పేర్కొన్నారు.

 గ్రామీణ భారతదేశంలో కులపీడన, సామాజిక బహిష్కరణ, మానవ గౌరవం కోసం సాగిన పోరాటాలను ఈ నవలలు స్పష్టంగా, హృద్యంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ  కమిషన్ మాజీ చైర్మన్  బి.ఎస్. రాములు అధ్యక్షత వహించగా,  సాహితీవేత్తలు  మణికొండ వేదకుమార్,  సంగిశెట్టి శ్రీనివాస్,  పిల్లలమర్రి రాములు,  సునీత , అనువాదకురాలు డా. సుమేధ ద్యావనపల్లి, పబ్లిషర్​   కోయ చంద్రమోహన్  పాల్గొన్నారు.