బాన్సువాడ, వెలుగు : గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలోని 137 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 111 మంది కాంగ్రెస్ సర్పంచులు, ఉప సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు.
నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలన్నారు. ఒక నాయకుడిగా ఉన్నత స్థానాలకు ఎదగాలంటే ఇదే మంచి అవకాశం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
