కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ సూచించారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచులు, కౌన్సిలర్లకు ట్రైనింగ్ నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా హాజరైన షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే ఉద్ధేశంతో ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణ చేపట్టిందన్నారు.
మౌలిక వసతుల కల్పన, పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యచరణను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఎస్పీ రాజేశ్చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, అధికారులు పాల్గొన్నారు. వివిధ ఆంశాలపై పవర్ పాయింట్‌ప్రజంటేషన్ ఇచ్చారు.
