నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అర్థరాత్రి 2 గంటలకు ఇందల్వాయి,గన్నారం మధ్యలో అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..తీవ్రగాయాలైన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రులను వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగిందని చెప్పారు.. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
