కరీంనగర్ జిల్లాలో రెండో రోజు- హుషారుగా ‘కాకా’ క్రికెట్‌‌‌‌‌‌‌‌ టోర్నీ

కరీంనగర్ జిల్లాలో  రెండో రోజు- హుషారుగా ‘కాకా’ క్రికెట్‌‌‌‌‌‌‌‌ టోర్నీ

తిమ్మాపూర్​, వెలుగు: కరీంనగర్​జిల్లా తిమ్మాపూర్​మండలం అలుగునూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వెలిచాల జగపతిరావు క్రికెట్​ గ్రౌండ్​లో జరుగుతున్న కాకా వెంకటస్వామి స్మారక తెలంగాణ అంతర్ జిల్లా టీ-20 లీగ్ రెండోరోజూ కొనసాగింది. బుధవారం ఉదయం జరిగిన మొదటి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన పెద్దపల్లి జిల్లా ఫీల్డింగ్ ఎంచుకోగా.. సిరిసిల్ల జట్టు 19.5 ఓవర్లలో 158 పరుగులకు ఆల్‌‌‌‌‌‌‌‌ అవుట్ అయ్యింది. 

ఈ జట్టులో రాజు 70 పరుగులు చేయగా పెద్దపల్లి జట్టులో రాహుల్​, రుమాన్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం పెద్దపల్లి జట్టు 16.2 ఓవర్లలో 74 పరుగులకు ఆల్​అవుట్​ అయింది. ఆ జట్టులో సాయితేజ 4 వికెట్లు తీశాడు. ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన రాజుకు మ్యాన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జగిత్యాల, కరీంనగర్ జిల్లా తలపడ్డాయి. టాస్ గెలిచి కరీంనగర్ జట్టు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కరీంనగర్ జట్టులో అక్రం 27 పరుగులు, సాత్విక్ 24 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జగిత్యాల జట్టు కేవలం 41 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. 

కరీంనగర్ జట్టులో అర్షద్ 3 ఓవర్లు వేసి 3 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. అద్భుత బౌలింగ్ ప్రదర్శనకుగానూ అర్షద్‌‌‌‌‌‌‌‌కు మ్యాన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ దక్కింది. శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్​ ముద్దసాని రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి అతనికి క్యాష్ రివార్డు అందించారు. కేడీసీఏ ప్రెసిడెంట్ వెలిచాల ఆగంరావు, వైస్​ ప్రెసిడెంట్​ కోడూరి మహేందర్​ గౌడ్​, పి.మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, సెక్రటరీ ఎన్‌‌‌‌‌‌‌‌.మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఈసీ మెంబర్లు హరికృష్ణగౌడ్​, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.సాగర్​ రావు, సీహెచ్‌‌‌‌‌‌‌‌.అజిత్ కుమార్​టోర్నీని పర్యవేక్షించారు.