ఎన్నికలు రద్దు చేసేందుకు నువ్వే చంపావ్.. ముదిరిన బంగ్లాదేశ్ సంక్షోభం

ఎన్నికలు రద్దు చేసేందుకు నువ్వే చంపావ్.. ముదిరిన బంగ్లాదేశ్ సంక్షోభం

స్టూడెండ్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాది హత్యపై అతని సోదరుడు సంచలన కామెంట్స్ చేశారు. బంగ్లాదేశ్ లో ఎన్నికల రద్దు చేసేందుకే ప్రభుత్వ సలహాదారు యూనస్ ఖాన్  తన సోదరుడిని చంపేశాడని  ఆరోపించారు. తన సోదరుడి హత్యకు అధికారంలో ఉన్నవారే కారణమని ఒమర్ హాది అన్నారు. ఉస్మాన్ హాది మరణానికి వారు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగాయి. హాదీ మరణం దేశవ్యాప్తంగా నిరసనలు , హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. అయితే రాబోయే బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేసేందుకే తాత్కాలిక ప్రభుత్వం హాదిని హత్య చేసిందని అతని సోదరుడు ముహమ్మద్ యూనుస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
డిసెంబర్ 12న 32 ఏళ్ల కవి ,ఇంకిలాబ్ మంచ్ ఉద్యమ నేత అయిన హాది ఢాకాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాల్పులకు గురయ్యారు. చికిత్స కోసం అతడిని సింగపూర్‌కు తరలించారు. డిసెంబర్ 18న హాదీ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర అశాంతికి దారితీసింది. హాదీ కుటుంబానికి న్యాయం చేయడంతో ప్రభుత్వం విఫలమైందని, న్యాయజరకపోతే మీరు పారిపోవాల్సి వస్తుందని  హెచ్చరించాడు. 

ALSO READ : బంగ్లాదేశ్లో ఆగని హింస..హిందూ కుటుంబాలే టార్గెట్గా దాడులు

మరోవైపు హాది అంత్యక్రియలకు భారీ భద్రత మధ్య వేలాది మంది హాజరయ్యారు. వారంతా హాది రక్తం వృధా కాదు వంటి నినాదాలు చేశారు. మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవీచ్యుతురాలిని చేయడం కీరోల్ పోషించాడు హాదీ.రాబోయే పార్లమెంటరీ ఎన్నికలలో అతని ప్రభావం చాలా ఉంటుందని భావిస్తున్న క్రమంలో హాదీ హత్య బంగ్లాదేశ్ లో సంచలనం సృష్టించింది.