బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. బుధవారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ప్రస్తుతం ఈ టీజర్ రిలీజ్ ఫుల్ ఎంటర్‌టైన్ లోడింగ్తో యూట్యూబ్ లో దూసుకెళ్తోంది.
ఏపీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు టీజర్‌ను లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. నిర్మాతలు బెల్లంకొండ సురేష్, అశోక్ కొల్ల, వంశీ నందిపాటి, శివ కంఠమనేని అతిథులుగా హాజరై సినిమా ఘనవిజయం సాధించాలని శుభాకాంక్షలు చెప్పారు.
హీరో అమర్‌దీప్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసే సినిమా ఇది. చాలా మంచి విషయం ఉన్న సినిమా. రవితేజ గారిని రిఫర్ చేస్తూ కొన్ని సీన్స్ ఉంటాయి. అలాగే పాటలు సంగీతం అద్భుతంగా ఉండబోతున్నాయి’ అని చెప్పాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ శైలి చౌదరి థ్యాంక్స్ చెప్పింది. అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా సినిమా ఉండబోతోందని దర్శకుడు తెలిపాడు.
నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంటర్‌టైన్ అయ్యే సినిమా ఇది. సరదాగా మొదలైన ఈ సినిమా ఎవరి మనోభావాలకు ఇబ్బంది కలిగించకుండా మంచి సందేశాత్మక చిత్రంగా ఉండబోతోంది. మంచి తెలుగుతనం ఉన్న టైటిల్‌తో ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని చెప్పారు. అర్జున్ అంబటి, యశ్ని గౌడ, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
