కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాకు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్‌గా జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ అడ్వకేట్ బండారి సురేందర్‌రెడ్డి నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ లా మినిస్ర్టీ, జస్టిస్ నుంచి ఈ మేరకు నియమించారు.
సీనియర్ అడ్వకేట్‌తో పాటు ప్రస్తుతం బీజేపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. తన నియామకానికి కృషి చేసిన స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ రామారావు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రారావు, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డిలకు సురేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
