పొలాసలో ని అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులతో మంత్రి అడ్లూరి ఇంటరాక్షన్

పొలాసలో ని అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులతో  మంత్రి అడ్లూరి ఇంటరాక్షన్

జగిత్యాల రూరల్, వెలుగు: రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యరంగంపై దృష్టి సారించి, మౌలిక వసతల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయశంకర్ అగ్రికల్చర్ కాలేజీలో నిర్వహించిన ‘ఇంటరాక్షన్ మీటింగ్ విత్ స్టూడెంట్స్’ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వీసీ జానయ్యతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానయ్య విజన్ ఉన్న వ్యక్తి అని వ్యవసాయ కాలేజీకి సంబంధించి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. 

గతంలో సరైన ప్రొఫెసర్లు లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వీసీని నియమించి మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకున్నారన్నారు. ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా రూ.7 కోట్లు మంజూరయ్యాయని, ఇంకా నిధులు కావాలని కోరుతున్నారని, వాటిని కూడా విడుదల చేస్తామన్నారు.