ఒక్క ఎగ్జామ్ తో SSC LDC లో జాబ్స్..వేలల్లో జీతం

ఒక్క ఎగ్జామ్ తో   SSC LDC లో జాబ్స్..వేలల్లో జీతం

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్​సీ) గ్రేడ్– సి స్టెనోగ్రాఫర్ (ఎల్​డీసీఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి,  అర్హత గల అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ  2026, జనవరి 11.

పోస్టుల సంఖ్య: 326.
విభాగాల వారీగా ఖాళీలు: సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీసెస్ 267, రైల్వే బోర్డు సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ 08, సాయుధ దళాల ప్రధాన కార్యాలయం స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ 37, భారత ఎన్నికల కమిషన్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ 01, ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్రాంచ్ (బి) స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ 13.
ఎలిజిబిలిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్​గా పనిచేస్తూ స్టెనోగ్రాఫర్ సర్వీస్ నిబంధనల ప్రకారం ఇతర అర్హతలు కలిగి ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 22.
లాస్ట్ డేట్: 2026, జనవరి 11. 
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, హిందీ/ ఇంగ్లిష్ లో షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్, సర్వీస్ రికార్డ్ (ఏపీఏఆర్ఎస్) మూల్యంకనం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్​సైట్​ను 
సందర్శించండి. 
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. జనరల్ అవేర్​నెస్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు, కాంప్రహెన్షన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్​ ఇంగ్లిష్​ లాంగ్వేజ్ 100 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. 
షార్ట్​హ్యాండ్ స్కిల్ టెస్ట్
కంప్యూటర్ ఆధారిత పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులను మాత్రమే స్టెనోగ్రఫీ పరీక్షకు పిలుస్తారు. ఇంగ్లిష్ లేదా హిందీలో (ఎంచుకున్నట్లు) 100 డబ్ల్యూపీఎం 10 నిమిషాల డిక్టేషన్ ఉంటుంది.
కంప్యూటర్‌లో ట్రాన్స్క్రిప్షన్: ఇంగ్లిష్ 40 నిమిషాలు, హిందీ 55 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.