- మంత్రి శ్రీధర్‌బాబు
ముత్తారం, వెలుగు: ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం ముత్తారం మండలానికి మంజూరైన 108 అంబులెన్స్‌ను మచ్చుపేట గ్రామంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో వైద్యం కోసం తరలించేందుకు ఈ 108 అంబులెన్స్‌ను కేటాయించినట్లు చెప్పారు.
ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో ఏర్పడిన కొత్త పాలకవర్గాలకు ప్రభుత్వ పరంగా తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ దుండె రాజేశం విగ్రహాన్ని ఆవిష్కరించారు.
