పార్లమెంట్‌లోకి స్మార్ట్ డివైజెస్ తీసుకురావొద్దు: ఎంపీలకు లోక్ సభ సెక్రటేరియట్ హెచ్చరిక

పార్లమెంట్‌లోకి స్మార్ట్ డివైజెస్ తీసుకురావొద్దు: ఎంపీలకు లోక్ సభ సెక్రటేరియట్ హెచ్చరిక

పార్లమెంట్ ఆవరణలో ఎంపీలకు నిబంధనలు గట్టిగా  అమలు చేస్తోంది లోక్ సభ సెక్రటేరియట్. ఇకపై ఎంపీలు స్మార్ట్ స్మార్ట్ కళ్లద్దాలు,  పెన్ కెమెరాలు, వాచెస్ వంటి  డివైజులు   పార్లమెంటులోగానీ, పార్లమెంటు ప్రాంగణంలోగానీ ఎటువంటి స్మార్ట్ డివైజస్ ఉపయోగించకూడదని లోక్ సభ సెక్రటేరియల్ స్పష్టం చేసింది.  ఇది వారి గోప్యతకు, భద్రతకు భంగం కలిగిస్తుందని ఇది పార్లమెంట్ అధికారాలను ఉల్లంఘించే అవకాశం ఉందని తెలిపింది. 

పార్లమెంటు ఆవరణలో స్మార్ట్ గ్లాసెస్, పెన్ కెమెరాలు, స్మార్ట్ వాచ్‌లు వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించవద్దని లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం ఎంపీలను కోరింది.

లోక్‌సభ బులెటిన్ ప్రకారం..స్మార్ట్ డివైజెస్ ఎంపీల గోప్యతకు ముప్పును కలిస్తాయి.అదే విధంగా పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలను  కూడా ఉల్లంఘించే అవకాశం ఉంది అందుకే ఎంపీలు తమ వెంట ఇటువంటి పరికరాలను తీసుకురావొద్దని సూచించింది సెక్రటేరియట్.ఇటువంటి డిజిటల్ పరికరాలు ఇప్పుడు దేశంలో సులభంగా అందుబాటులో ఉన్నాయి , గోప్యతకు ప్రమాదం కలిగిస్తాయి.  రహస్య సమాచారాన్ని రికార్డ్ చేసేందుకు  ఈ పరికరాలను దుర్వినియోగం చేయవచ్చని.. పార్లమెంటు ప్రాంగణంలో ఎక్కడా వీటిని ఉపయోగించవద్దని ఎంపీలకు ఆదేశాలు జారీ చేసింది. 

మరోవైపు పార్లమెంటు ఆవరణలో మొబైల్ ఫోన్లు ,ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై నియమాలు ఇప్పటికే పార్లమెంటులో అమలులో ఉన్నాయి. స్మార్ట్ గాడ్జెట్ల వినియోగం పెరుగుతున్నందున మళ్ళీ హెచ్చరిక జారీ చేసింది సెక్రటేరియట్. ఇటువంటి డివైజ్ లు పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించవచ్చని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది.