ఉమామహేశ్వర ఆలయంలో మేయర్ దంపతుల ప్రత్యేక పూజలు

ఉమామహేశ్వర ఆలయంలో మేయర్ దంపతుల ప్రత్యేక పూజలు

అచ్చంపేట, వెలుగు : శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి దంపతులు బుధవారం సందర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా రంగాపూర్ సమీపంలోని ఉమామహేశ్వర ఆలయానికి వచ్చిన మేయర్ దంపతులకు ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఉమామహేశ్వర క్షేత్రంలో భక్తులకు ఏర్పాటు చేసిన వసతులపై వారు హర్షం వ్యక్తం చేశారు. వారి వెంట పాలక మండలి సభ్యుడు పవన్ కుమార్, వీరయ్య శాస్త్రి, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.