గాదె ఇన్నయ్య అరెస్ట్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి : చాడ వెంకటరెడ్డి

గాదె ఇన్నయ్య అరెస్ట్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి : చాడ వెంకటరెడ్డి
  •      సీపీఐ సీనియర్ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి

కరీంనగర్, వెలుగు: అనాథ పిల్లల కోసం ఆశ్రమాన్ని నడుపుతున్న గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్టు చేయడాన్ని దుర్మార్గపు చర్య అని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నయ్య అరెస్టుపై స్పందించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌‌‌‌‌‌‌‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ కు మొదటి నుంచి మహాత్మాగాంధీ అంటే గిట్టదని అందుకే ఆయన పేరును ఉపాధి హామీ చట్టం పేరులో తొలగించేందుకు పూనుకున్నారని ఆరోపించారు.  

సీపీఐ శతవసంతాల ఉత్సవాల్లో భాగంగా జనవరి 18న ఖమ్మం పట్టణంలో నిర్వహించే ముగింపు సభను విజయవంతం చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాగెల్లి లక్ష్మారెడ్డి, రాజు పాల్గొన్నారు.