హైదరాబాద్, వెలుగు: కేటీఆర్, హరీశ్ కు కాంగ్రెస్ ప్రభుత్వంపై అంత ఈర్ష్య ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూసీ చట్టాలను చేసిన కేటీఆర్.. ఇప్పుడు ఆ విషయం మరిచిపోయి మూసీ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హరీశ్ రావుకు విమర్శించేందుకు ఏ అంశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్లపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పంజాబ్, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే అప్పటి మీ ప్రభుత్వం పత్రికలకు యాడ్స్ ఇచ్చిన విషయం మరిచిపోయారా అని అన్నారు. టీఆర్‌ఎస్ ను బీఆర్‌ఎస్ గా మార్చినప్పుడు దేశం మొత్తమ్మీద తెలంగాణ ప్రజల సొమ్ముతో పేపర్ యాడ్స్ ఇచ్చిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు.
